వాట్సాప్‌లో స్పెషల్ ‘నవరాత్రి స్టిక్కర్స్’

by Shyam |
CELL-Phone-Meems
X

దిశ, ఫీచర్స్: మహమ్మారి కారణంగా గత ఏడాది పండుగలకు దూరమైన ప్రజలు ఈసారి గ్రాండ్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇప్పటికే గణేష్ పండుగను దివ్యంగా జరుపుకున్న భారతీయులు, ప్రస్తుతం దసరా మూడ్‌లోకి వచ్చేశారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమీ నుంచి శుద్ధ నవమి వరకూ తొమ్మిది రోజులపాటు అమ్మవారిని వివిధ రూపాల్లో పూజిస్తారు. శరన్నవరాత్రులు, దేవి నవరాత్రులుగా వీటిని పిలుస్తుండగా, మహాశక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని నవరాత్రులు తొమ్మిది రూపాలలో అలంకరిస్తారు. ఈ సందర్భంగా వాట్సాప్ ప్రత్యేకంగా ‘నవరాత్రి’ స్టిక్కర్లు, జిఫ్‌లను విడుదల చేసింది. వాటిని ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకుందాం.

వాట్సాప్ స్టిక్కర్స్ :
* వాట్సాప్ చాట్‌ను తెరిచి, చాట్ బార్‌లోని స్టిక్కర్ ఐకాన్‌పై క్లిక్ చేసి, ‘+’ గుర్తుకు వెళ్లండి. ఒకవేళ మీరు ఐఫోన్ ఉపయోగిస్తుంటే, Apple App Store నుంచి Sticker.ly ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
* ఇప్పుడు, క్రిందికి స్క్రోల్ చేసి గెట్ మోర్ స్కి్క్కర్స్ అనే ఆప్షన్ ఎంచుకోండి. నవరాత్రి వాట్సాప్ స్టిక్కర్‌ల కోసం గూగుల్ ప్లే స్టోర్‌ ఓపెన్ అవుతుంది.
* ఇప్పుడు, యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, దాన్ని ప్రారంభించండి. అప్పుడు మీరు యాప్‌ను ఓపెన్ చేసి, ‘యాడ్ ఆన్ వాట్సాప్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
* ఇప్పుడు, ఇది ఆటోమేటిక్‌గా వాట్సాప్‌లో అందుబాటులో ఉంటుంది.

సొంత ఫొటోలతో కస్టమ్ స్టిక్కర్‌లను తయారు చేయవచ్చు. దాని కోసం, మీరు ‘స్టిక్కర్ మేక్ ఫర్ వాట్సాప్’ లేదా ‘స్టిక్కర్.లై’ వంటి యాప్‌లు అవసరం, వీటిని మీరు Google ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్‌లో సులభంగా కనుగొనవచ్చు.

నవరాత్రి స్టిక్కర్లను ఎలా తయారు చేయాలి?
* ముందుగా, మీకు నచ్చిన స్టిక్కర్ మేకర్ యాప్‌ను ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోండి.
* తర్వాత యాప్‌ని తెరిచి, ‘క్రియేట్ న్యూ ప్యాక్’ ఎంపికపై క్లిక్ చేయండి.
* అప్పుడు మీరు ప్యాక్‌కు ఒక పేరును ఇవ్వాలి. మీకు నచ్చిన ఫొటోతో స్టిక్కర్ చేయడానికి ‘స్టిక్కర్‌లను జోడించు’ పై క్లిక్ చేయండి. అయితే, వాట్సప్‌లో స్టిక్కర్‌లను జోడించడానికి మీరు ఒక ప్యాక్‌లో కనీసం మూడు స్టిక్కర్‌లను తయారు చేయాలి.
* మీరు క్యాప్షన్స్ కూడా జోడించవచ్చు. ఇప్పుడు వాట్సాప్‌కి స్టిక్కర్‌లను జోడించండి. వాటిని మీ స్నేహితులతో పంచుకోవచ్చు. మీరు ఏదైనా వీడియోను ఉపయోగించి యానిమేటెడ్ స్టిక్కర్‌లను కూడా సృష్టించవచ్చు.

Advertisement

Next Story