వాట్సాప్‌లో.. మాటలను.. అక్షరాలుగా మార్చే ‘ట్రాన్స్‌క్రిప్షన్’ ?

by Shyam |
వాట్సాప్‌లో.. మాటలను.. అక్షరాలుగా మార్చే ‘ట్రాన్స్‌క్రిప్షన్’ ?
X

దిశ, ఫీచర్స్: వాట్సాప్‌లో నిత్యం కుప్పలు తెప్పలుగా మెసేజ్‌లు వస్తూనే ఉంటాయి. అయితే అన్నింటికీ రిప్లయ్ ఇవ్వాలంటే కాస్త కష్టమైన పనే. అందుకే మనం వాయిస్ రికార్డ్ చేసి పంపిస్తుంటాం. అలా కాకుండా వాయిస్ మెసేజ్‌ను టెక్ట్స్ రూపంలో సెండ్ చేస్తే భలే ఉంటుంది కదా! ప్రస్తుతం వాట్సాప్ అలాంటి ఫీచర్ తెచ్చే పనిలో ఉందని వాబ్‌బీటా ఇన్ఫో తెలిపింది.

వాయిస్‌ను టెక్ట్స్‌గా మలిచే ‘ట్రాన్స్‌క్రిప్షన్’ అనే కొత్త ఫీచర్‌ను ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఐవోఎస్ వెర్షన్‌లో త్వరలోనే తీసుకురాబోతుంది. ప్రస్తుతం టెస్టింగ్‌లో ఉండగా, ఇది కాలక్రమేణా ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులకు కూడా అందుబాటులోకి వస్తుందని సమాచారం. ప్రస్తుతం వాట్సాప్ ఇలాంటి సర్వీస్ అందించడం లేదు కానీ, థర్డ్ పార్టీ యాప్స్ వాయిస్ మెసేజ్‌లను టెక్ట్స్ ఫార్మాట్‌లో సెండ్ చేస్తున్నాయి. అయితే, ఈ యాప్‌లు తమ సర్వర్‌లలో స్పీచ్ డేటాను స్టోర్ చేస్తాయి, ఇవి గోప్యతా సమస్యలను పెంచుతాయి. ఇక ఐఓఎస్ వెర్షన్‌లో ఆడియోను ట్రాన్స్‌క్రైబ్ చేసే సర్వీస్‌ను యాపిల్ సంస్థే అందిస్తోంది. ఈ ఫీచర్‌ను ఉపయోగించి స్పీచ్ రికగ్నేషన్ ఇంప్రూవ్ చేయాలని యాపిల్ కూడా ప్రయత్నిస్తోంది.

వాట్సాప్ ప్రస్తుతానికి దీనిపై అధికారిక ప్రకటన ఏమీ ఇవ్వలేదు, ట్రాన్స్‌క్రిప్షన్ ఫీచర్ వినియోగదారులకు ఎప్పుడు అందుబాటులో ఉంటుందనే దానిపై కూడా కచ్చితమైన టైమ్‌లైన్ లేదు. అయితే అతి త్వరలోనే బీటా టెస్టర్‌లకు దాని యాక్సెస్‌ను అందించవచ్చని వాబ్‌బీటా ఇన్ఫో తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed