TG Assembly: సభ నడిచే తీరుపై ఎంఐఎం సభ్యుల ఆగ్రహం.. అసెంబ్లీ నుంచి వాకౌట్

by Shiva |   ( Updated:2025-03-17 06:44:05.0  )
TG Assembly: సభ నడిచే తీరుపై ఎంఐఎం సభ్యుల ఆగ్రహం.. అసెంబ్లీ నుంచి వాకౌట్
X

దిశ, వెబ్‌డెస్క్: నాలుగో రోజు అసెంబ్లీ (Assembly) సమావేశాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సభ నుంచి ఏఐఎంఐఎం (AIMIM) సభ్యలు వాకౌట్ చేశారు. స్పీకర్ (Speaker) సభ నడుపుతోన్న తీరును నిరసిస్తూ వారు సభ నుంచి వాకౌట్ (Walk Out) చేస్తున్నట్లుగా ప్రకటించారు. అనంతరం అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. అసెంబ్లీ (Assembly) గాంధీభవన్ (Gandhi Bhavan) కాదని.. తెలంగాణ శాసనసభ (Telangana Assembly) అని ఫైర్ అయ్యారు. గాంధీ‌భవన్ తరహాలో కాకుండా అసెంబ్లీని అసెంబ్లీగా నడపాలని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల్లో కనీసం తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఒకవేళ ఇచ్చినా మాట్లాడుతుండగానే మైక్ కట్ చేస్తున్నారని ఇదేం పద్ధతి అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుండటం బాధాకరమని అన్నారు.

Next Story

Most Viewed