వాట్సప్.. మీ భద్రతకు మాది హామీ!

by Anukaran |   ( Updated:2021-01-17 01:25:41.0  )
వాట్సప్.. మీ భద్రతకు మాది హామీ!
X

దిశ, వెబ్‌డెస్క్ : వాట్సప్ తన ప్రైవసీ పాలసీలో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూజర్స్ గందరగోళానికి గురైన విషయం తెలిసిందే. వ్యక్తిగత సమాచార గోప్యత విషయంలో వాట్సప్ ఇదివరకు ఉన్న నిబంధనలు సడలిస్తే.. యూజర్ ప్రైవసీకి భద్రత ఉండదని అంతా భావించారు. అయితే, కొత్తగా తీసుకొచ్చే మార్పులతో యూజర్స్ డేటా, ప్రైవసీకి ఎలాంటి రిస్క్ ఉండదని వాట్సప్ స్టేటస్ రూపంలో చెప్పేందుకు ప్రయత్నిస్తోంది.

ఇవాళ వినియోగదారుల మొబైల్ స్టేటస్‌లో ఈ విషయాన్ని ప్రచారం చేసింది. ‘మేము మీ వ్యక్తిగత భద్రతకు కట్టుబడి ఉన్నాం. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ విధానం వల్ల వాట్సప్ మీ పర్సనల్ మెసేజ్ లను చదవదు. మీరు షేర్ చేసే లొకేషన్ వివరాలు చూడదు. మీ కాంటాక్ట్స్ కూడా ఫేస్ బుక్‌తో పంచుకోదంటూ’ తమ యూజర్స్ కు అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది.

Advertisement

Next Story