ఈసారి ఆస్కార్ గిఫ్ట్ బ్యాగ్‌లో ఏముంది?

by Shyam |
ఈసారి ఆస్కార్ గిఫ్ట్ బ్యాగ్‌లో ఏముంది?
X

ఫిబ్రవరి నెల అంటేనే అవార్డుల సీజన్. ముఖ్యంగా ఆస్కార్ అవార్డుల కోసం సినీ ప్రముఖులు ఎదురుచూస్తుంటారు. అయితే అవార్డు అందరినీ వరించదు కదా.. అందుకే ప్రధాన కేటగిరీల్లో అంటే ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయనటుడు, ఉత్తమ సహాయనటి, ఉత్తమ దర్శకుడు కేటగిరీల్లో నామినేట్ అయిన వారికి ఆస్కార్ వారు గిఫ్టు బ్యాగులను అందిస్తారు. ఈ సంవత్సరం ఇవ్వబోయే గిఫ్టు బ్యాగు విలువ 251000 డాలర్లు అంటే దాదాపు రూ. 1.5 కోట్లు. మరి ఆ గిఫ్టు బ్యాగులో ఏముంది?

మొత్తం 73 రకాల బహుమతులతో నిండి ఉన్న ఈ బ్యాగులో రూ. 55 లక్షలు విలువ చేసే 12 రోజుల క్రూయిజ్ ట్రిప్ నుంచి కోడ్ సిగ్నేచర్ వారి చాక్లెట్ వరకు అన్ని రకాల బహుమతులు ఉంటాయి. వీటిలో ముఖ్యంగా బ్రాస్‌లెట్, మీల్ పాస్, నెక్లెస్, నవలు, టానిక్, కారు ఫ్రాగ్రాన్స్, మూవీ పోస్టర్లు, టూత్ పేస్టులు, ఇతర రిసార్టులకు టికెట్లు, బార్ పాస్, వివిధ సేవలకు మెంబర్‌షిప్‌లు, వేప్ పెన్, టీ షర్టులు ఇలా వివిధ రకాల గిఫ్టులు ఉంటాయి. ఈసారి ప్రధాన కేటగిరీల్లో నమోదైన 25 మంది నటీనటులకు ఈ ఏడాది గిఫ్టు బ్యాగు అందనుంది.

Advertisement

Next Story