- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్ నెక్ట్స్ స్టెప్.. నిరుద్యోగ పోరాటమా… ‘పాదయాత్ర’నా..?
దిశ, తెలంగాణ బ్యూరో : టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి మరికొద్ది గంటల్లో ప్రమాణస్వీకారం చేయనుండగా.. ఆయన ఎలాంటి ప్రకటన చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. దీనికోసం కాంగ్రెస్ శ్రేణులతో పాటు టీఆర్‌ఎస్, బీజేపీ నేతలు కూడా ఎదురుచూస్తున్నారు. పార్టీలోని సీనియర్లను కలిసిన నేపథ్యంలో దీనిపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ముందుగా నిరుద్యోగ సమస్యలపై పోరాటమా.. లేకుంటే రాష్ట్రంలో అచ్చంపేట నుంచి ఆదిలాబాద్ వరకు పాదయాత్ర చేయడమా.. అనే అంశంపై రేవంత్‌రెడ్డి క్లారిటీ ఇస్తారా అనే చర్చ సాగుతోంది.
మరోవైపు ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పాదయాత్రను ప్రకటించారు. ఇలాంటి సమయంలో రెండు పార్టీలు ఒకేసారి పాదయాత్రకు దిగితే.. ప్రజల్లో ఒక విధమైన తికమక ఏర్పడుతుందని, దీంతో టీఆర్‌ఎస్‌కు కలిసి వచ్చే అవకాశం ఉన్నట్లు ఇరు పార్టీల సీనియర్ నేతలు సూచిస్తున్నారు.
ప్రమాణస్వీకారం తర్వాత రెండు రోజుల పాటు మాణిక్కం ఠాగూర్‌తో పాటు రేవంత్‌రెడ్డి రాష్ట్ర, జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రాష్ట్రస్థాయి నేతలతో ఒకరోజు, జిల్లా కాంగ్రెస్అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్‌చార్జీలతో వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సమావేశాల్లో చాలా అంశాలను ప్రస్తావించే అవకాశాలున్నాయి.
మరోవైపు ప్రమాణస్వీకారం తర్వాత రేవంత్‌రెడ్డి ఎలాంటి స్పీచ్ ఇస్తారో ఇప్పుడు చాలా హాట్ టాపిక్‌గా మారింది. చాలా మంది సీనియర్లతో చర్చించిన రేవంత్.. ముందుగా నిరుద్యోగ సమస్య, ఉద్యోగాల భర్తీ అంశాన్ని ఎజెండాగా తీసుకుంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ప్రభుత్వం కూడా 50 వేల ఉద్యోగాల భర్తీ ప్రకటన చేసినా ఇంకా ఆలస్యం చేస్తుండటంతో ఇప్పుడు కాంగ్రెస్‌పార్టీ ఇదే ఎజెండాతో ఉద్యమిస్తే పార్టీకి చాలా మైలేజ్వస్తుందంటున్నారు. ప్రస్తుతం పాదయాత్రను కొంత వరకు వాయిదా వేసుకుంటేనే మంచిదంటూ సూచిస్తున్నట్లు సమాచారం.
సాధారణంగా రేవంత్‌రెడ్డి స్పీచ్అనేది చాలా హెరాహోరీగా ఉంటుంది. ఎంపీగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రెచ్చగొట్టే ప్రసంగాలు ఆయా సందర్భాల్లో చేశారు. కానీ టీపీసీసీ చీఫ్‌గా తొలి స్పీచ్ మాత్రం చాలా ప్రాధాన్యత సంతరించుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలకు పిలుపునివ్వడం ఇక్కడి నుంచే మొదలుకానుంది. ఈ నేపథ్యంలో పాదయాత్రనా.. నిరుద్యోగ అంశంపై పోరాటమా.. అనే దానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తాడనే దానిపై ఉత్కంఠ నెలకొంది.