ఉత్కంఠగా కడప ఎన్నిక.. పీఠం ఎవరిది..?

by srinivas |   ( Updated:2025-03-20 13:45:49.0  )
ఉత్కంఠగా కడప ఎన్నిక.. పీఠం ఎవరిది..?
X

దిశ, వెబ్ డెస్క్: కడప జెడ్పీ(kadapa Zp) పీఠం ఎన్నిక ఉత్కంఠగా మారింది. చైర్మన్ ఎన్నిక కోసం ఇప్పటికే ఎన్నికల(Elections) సంఘం నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నెల 27 వరకు అభ్యర్థులు నామినేషన్లు వేసే అవకాశం కల్పించింది. దీంతో నామినేషన్లు స్వీకరిస్తున్నారు. 27వ తారీకున మధ్యాహ్నం చైర్మన్‌ను ఎన్నుకుంటారు.

కడప జిల్లాలో 50 జడ్పీటీలు ఉన్నాయి. ఇందులో వైసీపీ(Ycp) 49 స్థానాలు గెలుచుకోగా.. టీడీపీ(Tdp) ఒక స్థానంలో విజయం సాధించింది. అయితే రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Party)కి షాక్ తగిలింది. టీడీపీలో ఆరుగురు వైసీపీ జెడ్పీటీలు, బీజేపీలో ఒకరు చేరారు. ఇద్దరు మృతి చెందారు. ఒక జెడ్పీటీసీ రాజీనామా చేశారు. దీంతో కూటమి బలం 8కి పెరిగింది. ప్రస్తుతం వైసీపీలో 38 మంది జెడ్పీటీసీలు కొనసాగుతున్నారు.

ప్రస్తుతం బ్రహ్మంగారి మఠం జెడ్పీటీసీని రామగోవింద్ రెడ్డిని వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు. దాదాపు కడప జెడ్పీ చైర్మన్ పీఠం వైసీపీకి దక్కు అవకాశం ఉందని అంటున్నారు. కానీ వైసీపీకి అసంతృప్తి బెడద ఉంది. కొద్ది రోజులుగా కొందరు జెడ్పీటీసీలు అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఇప్పుడు వీరిని కూటమి నాయకులు తమ వైపు ఆకర్షిస్తున్నట్లు సమాచారం. దీంతో కడప జెడ్పీ పీఠం ఎవరికి దక్కుందోనని కూటమి, వైసీపీ దిగువ స్థాయి నాయకులు టెన్షన్ పడుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Next Story

Most Viewed