ప్రశ్నిస్తే ఇల్లు ముట్టడిస్తారా ?

by Sridhar Babu |
ప్రశ్నిస్తే ఇల్లు ముట్టడిస్తారా ?
X

దిశ, మానకొండూరు : కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలకేంద్రంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కవ్వంపల్లిపై నిప్పులు చేరిగారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటాకింద కవ్వంపల్లి నాయాపైసా పనిచెయ్యలేదని అన్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో అవినీతికి పాల్పడుతున్నారని ప్రశ్నిస్తే బుధవారం కవ్వం పల్లి తన ఇల్లు ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారని ఆరోపించారు. ఎమ్మెల్యే చేసిన అవినీతి చిట్టా మొత్తం తన దగ్గర ఉందని, దమ్ముంటే మీ క్యాంప్ ఆఫీస్ కి చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్​ విసిరారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానంపై తాను నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటా అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Next Story