పాలమూరుకు మరో బైపాస్ రోడ్డు అవసరం

by Naveena |
పాలమూరుకు మరో బైపాస్ రోడ్డు అవసరం
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ పట్టణానికి మరో బైపాస్ రోడ్డు ఎంతో అవసరం ఉందని, వెంటనే ఏర్పాటు చేయాలని పార్లమెంటు సభ్యురాలు డికె అరుణ,ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి లు గురువారం ఢిల్లీలో లో కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మహబూబ్ నగర్ పట్టణం నలుమూలల విస్తరిస్తుందని,త్వరలో పట్టణ నడిబొడ్డున అతి పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం కాబోతుందన్నారు. భారీ వాహనాలు,కార్లు,ద్విచక్ర వాహనాలతో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయాయని వారు తెలిపారు. అంతేకాక మున్సిపాలిటీ కార్పోరేషన్ గా మారిందని,ఎన్నో నూతన విద్యా సంస్థల,యూనివర్సిటీ లు జిల్లా కేంద్రంలో ఏర్పాటు కాబోతున్నాయని,రెండు నేషనల్ హైవే లు జిల్లా గుండా వెళ్ళుతున్నాయని వారు కేంద్ర మంత్రికి వివారించారు.

ఇంతేకాక వ్యవసాయ ఉత్పత్తుల రవాణా,పరిసర ప్రాంత గ్రామాల నుంచి ప్రజల రాకపోకల తాకిడి,ఇటు హైదరాబాద్,అటు కర్ణాటక,రాయిచూర్ ల మధ్య జరుగుతున్న రవాణా కు సులభతరం అవుతుందన్నారు. అలాగే పారిశ్రామిక అభివృద్ధికి ఉపయుక్తంగా ఉంటుందని మంత్రికి తెలుపగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు,పట్టణానికి త్వరలో మరో బైపాస్ రోడ్డు రానున్నట్లు వారు ఆశాభావం వ్యక్తంచేశారు.

Next Story

Most Viewed