- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మహిళ ఆత్మహత్యాయత్నం.. రక్షించిన పోలీసులు

దిశ, హిందూపురం: భర్త చనిపోయిన సమయంలో వచ్చిన బీమా సొమ్ము కుటుంబ సభ్యులు తనకు ఇవ్వలేదని బాధతో, మనస్థాపం చెందిన ఓ మహిళ రైల్వే ట్రాక్ పై ఆత్మహత్యకు ప్రయత్నించగా, హిందూపురం ఆప్ గ్రేడ్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ప్రాణాలు రక్షించారు. సీఐ ఆంజనేయులు తెలిపిన వివరాల మేరకు.. లేపాక్షికి చెందిన ఓ మహిళ తన భర్త ప్రమాదంలో మరణించినప్పుడు వచ్చిన పరిహారం డబ్బులు వారి కుటుంబ సభ్యులు మొత్తం తీసుకున్నారు. ఆ డబ్బులు తన జీవనోపాధి ఇవ్వాలని ఆమె కోరగా వారు ఆ డబ్బులు ఇవ్వనందుకు మనస్థాపంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.
హిందూపురం రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చి మహిళ తన తల్లికి మొబైల్ లో మెసేజ్ చేసి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా గురించి ఎవరు వెతకండి నా బిడ్డ జాగ్రత్త అని మెసేజ్ చేసి సెల్ స్విచ్ ఆఫ్ చేసింది. వెంటనే తల్లి లేపాక్షి పోలీసులును సంప్రదించగా స్టేషన్ లో విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సాయి వెంటనే హిందూపూర్ రూరల్ ఆప్ గ్రేడ్ సిఐ చంద్ర ,ఆంజనేయులు కి సమాచారం అందించారు. వెంటనే 15 నిమిషాల్లో సెల్ లాస్ట్ సిగ్నల్ ద్వారా రైల్వే ట్రాక్ పైన ఉన్నట్లు గుర్తించి, ఆ ప్రాంతానికి వెళ్లి ఆ మహిళ ప్రాణాలను రక్షించారు. మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. తమ బిడ్డ ప్రాణాలు కాపాడిన పోలీసులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. మహిళ ప్రాణాలను కాపాడిన సీఐ ఆంజనేయులు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.