- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Bihar: కుళాయి నీటి విషయంలో వివాదం.. కేంద్ర మంత్రి మేనళ్లుడి కాల్చివేత !

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌లోని భాగల్ పూర్ (Bhagalpur)లో విషాద ఘటన చోటు చేసుకుంది. కులాయి నీటి విషయంలో జరిగిన ఘర్షణలో కేంద్ర హోం శాఖ మంత్రి నిత్యానందరాయ్ (Nithyananda Rai) మేనళ్లుడు కాల్చి చంపబడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భాగల్‌పూర్ లోని జగత్‌పూర్ (Jagathpur) గ్రామంలో నిత్యానందరాయ్ మేనళ్లుల్లు జైజీత్ యాదవ్, విశ్వజీత్ యాదవ్‌ల మధ్య కుళాయి నీటి విషయంలో వివాదం నెలకొంది. ఈ క్రమంలోనే ఆగ్రహం వ్యక్తం చేసిన ఇద్దరు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. దీంతో అన్నదమ్ములిద్దరికీ తీవ్ర గాయాలు కాగా పరిస్థితి విషమించి విశ్వజిత్ యాదవ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో వారి తల్లి చేతికి కూడా బుల్లెట్ తాకి గాయాలయ్యాయి.
దాదాపు నాలుగు నుంచి ఐదు రౌండ్లు పరస్పరం కాల్పులు జరుపుకున్నట్టు స్థానికులు తెలిపారు. జైజీత్ యాదవ్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే గతంలోనూ వీరిద్దరి మధ్య పలు విషయాల్లో తగాదాలు ఉన్నట్టు వారి సన్నిహితులు తెలిపారు. ఈ ఘటనలో భాగల్‌పూర్‌లో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. స్థానికులు సైతం తీవ్ర భయాందోళనకు గురయ్యారు.