EMI కట్టకపోతే హోమ్ సీజ్ చేస్తున్నారా.. ఈ రూల్స్ పాటించండి

by Harish |   ( Updated:2021-12-27 10:08:29.0  )
home loan
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలని ఆశ ఉంటుంది. మరి ఇల్లు కొనడం అంత తేలికైన పని కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇల్లు కొనాలంటే కొన్ని లక్షలు కావాలి. అన్ని లక్షలు పెట్టి ఇల్లు కొనడం మామూలు విషయం కాదు. అందుకే ఇల్లు కొనాలంటే మనకు మొదట గుర్తుకు వచ్చేది హోమ్ లోన్. నిధులు సమకూర్చడానికి ఒక వ్యక్తికి ఆర్థికంగా లాభదాయకమైన ఏకైక పద్ధతి గృహ రుణం. ప్రతిఒక్కరూ హోమ్ లోన్‌ను, ఈక్వేటెడ్ నెలవారీ వాయిదాల (EMIల) రూపంలో చెల్లిస్తారు. EMI లను సక్రమంగా చెల్లించడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. కానీ ఒకవేళ హోమ్ లోన్‌ EMI లను క్రమానుగతంగా చెల్లించకపోతే భవిష్యత్తులో ఎన్నో సమస్యలు వస్తాయి.

ఈఎంఐని స‌మ‌యానికి చెల్లించ‌కపోతే లేటు ఫీజు కింద‌ జ‌రిమానాలు విధిస్తారు. సాధార‌ణంగా చెల్లించాల్సిన‌ ఈఎంఐపై ఒక శాతం నుంచి రెండు శాతం వ‌ర‌కు జరిమానా విధించే అవ‌కాశం ఉంది. ఒక్క ఈఎంఐ వాయిదా చెల్లించ‌డంలో ఆల‌స్యం జ‌రిగినా అది మీ క్రెడిట్ స్కోరులో నమోదు అవుతుంది. క్రెడిట్ స్కోర్ 50-70 పాయింట్లు త‌గ్గొచ్చు. దీని వలన భవిష్యత్తులో తీసుకోనే రుణాలకు ఎఫెక్ట్ చూపిస్తుంది . లోన్‌ను సకాలంలో చెల్లించడం వలన క్రెడిట్ స్కోరు ఎక్కువ పెంచుకునే అవకాశం ఉంది.

EMI లను సకాలంలో చెల్లించలేకపోతే ఏం చేయాలి

EMIలను సకాలంలో చెల్లించలేకపోతే, రీపేమెంట్ షెడ్యూల్‌ను చేరుకోవడంలో మీకు సమస్య ఉందని తెలిసిన వెంటనే మీ బ్యాంక్‌ని సంప్రదించండి. మీరు మీ బకాయిలను చెల్లించడం పట్ల శ్రద్ధ వహించాలి. మంచి రీపేమెంట్ ట్రాక్ రికార్డ్ కలిగి ఉంటే, బ్యాంక్ మీకు కొంత వెసులుబాటును అందించడానికి సిద్ధంగా ఉంటుంది. బ్యాంక్ మీ హోమ్ లోన్ వ్యవధిని పొడిగించే అవకాశం ఉంది.

బ్యాంకు మీ ఇంటిని స్వాధీనం చేసుకోగలదా?

లోన్ తీసుకున్న వాళ్ళు ఒకటి లేదా రెండు EMI లను కట్టనట్లయితే, బ్యాంక్ వెంటనే ఆస్తిని స్వాధీనం చేసుకోదు. మూడు డిఫాల్ట్‌ల తర్వాత, బ్యాంకు లోన్ తీసుకున్నవారు తమ బకాయిలను వీలైనంత త్వరగా చెల్లించమని కోరుతూ నోటీసును పంపుతుంది. డిఫాల్ట్ ఆరు నెలల పాటు కొనసాగితే, తిరిగి చెల్లింపును క్రమబద్ధీకరించడానికి బ్యాంకులు లోన్ తీసుకున్న వారికి రెండు నెలల గ్రేస్ పీరియడ్ ఇస్తాయి. అలా చేయడంలో విఫలమైతే బ్యాంకులు రుణాన్ని నిరర్థక ఆస్తిగా (NPA) ప్రకటిస్తాయి. ఆ తర్వాత లోన్ రికవరీ కోసం ఆస్తిని వేలం వేయవచ్చు.

బ్యాంక్ మీ ఇంటిని స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా, మీ ఆస్తిని తిరిగి పొందేందుకు మీకు ఇంకా అవకాశం ఉంది. అయితే, వేలం జరిగే ముందు ఇది చేయాలి. వేలం తేదీ ప్రకటించబడినప్పటికీ, మీ ఇంటిని కాపాడుకోవడానికి మీరు అప్పటికీ మీ బకాయిలను చెల్లించవచ్చు.

Advertisement

Next Story