కిమ్ సోదరికి ఏమైంది?

by vinod kumar |
కిమ్ సోదరికి ఏమైంది?
X

దిశ, వెబ్‌డెస్క్ : కిమ్. ఈ పేరు వింటేనే ఉత్తర కొరియా ప్రజలు వణికిపోతారు. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో, ఎలా వ్యవహరిస్తాడో ఎవరికి అంతుపట్టదు. తనకన్న ఎక్కువ పాపులారిటీ వచ్చినా సహించలేడు. తనకు వ్యతిరేఖంగా వార్తలు వచ్చినా ఏం చేస్తాడో ఆ దేశ ప్రజలకు బాగా తెలుసు. అయితే గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. ఆ సమయంలో ఆయన సోదరి కిమ్ యో జోంగ్ కొన్ని కీలక బాధ్యతలు చేపట్టిపట్టు విస్తృత ప్రచారం జరిగింది. ఆమె అంతర్జాతీయంగా నిర్వహించిన దౌత్యంతో ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. ఇప్పుడు ఆ గుర్తింపే ఆమెకు ముప్పు తెచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.

కిమ్ ఆరోగ్యం సరిగా లేని సమయంలో కిమ్ యో జోంగ్‌కు ఆ దేశ అధికారాలు బదలాయించినట్లు పలు కథనానాలు వచ్చాయి. అయితే కిమ్ కుదుటపడి వచ్చాకా ఆమెకు కష్టాలు మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది. జులై 27 తర్వాత ఆమె ఎక్కడా కనిపించలేదు. ఏ మీడియా సమావేశానికి, అధికార పార్టీ మీటింగ్ లకు హాజరుకాలేదు. దీంతో ఆ దేశంలో భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. కిమ్ సోదరికి ఏమైందంటూ చర్చలు సాగుతున్నాయి. ఆమె ఆరోగ్యం బాగలేదా..? లేక ఏమన్న జరిగిందా అని మీడియా సైతం కథనాలు రాస్తున్నాయి. ఆమె దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. దీనిపై అధికార పక్షం నుంచి ఏ ఒకకరూ నోరు విప్పడం లేదు.

Advertisement

Next Story