కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏం చేస్తుంది?

by Shamantha N |
rahul gandhi
X

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం కేంద్రంపై మరోమారు విరుచుకుపడ్డారు. నాగాలాండ్‌‌లోని మోన్ జిల్లాలో తిరుగుబాటు వ్యతిరేక ఆపరేషన్ సమయంలో భద్రతా దళాలు పౌరులను చంపిన ఘటనపై కేంద్రం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఆయన ప్రశ్నించారు. ‘ఇదొ బాధాకరమైన ఘటన. కేంద్ర ప్రభుత్వం దీనికి సమాధానమివ్వాలి. సొంత ప్రాంతంలో పౌరులు లేదా భద్రత దళాలు సురక్షితంగా లేనప్పుడు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏం చేస్తుంది’ అని ప్రశ్నించారు. ఆదివారం తెల్లవారుజామున భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో 13 మంది అమాయకుపు పౌరులు మరణించారు. ఓ సైనికుడు కూడా మరణించినట్లు అధికారులు తెలిపారు. కాగా పౌరుల హత్యపై ఆర్మీ ఆదివారం కోర్టు ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించింది. సంఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది.

Advertisement

Next Story

Most Viewed