- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మీ సొంత అక్కాచెల్లెళ్ల సంగతేంటి..? జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన లోకేష్
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో మహిళల భద్రత కోసం వైఎస్ జగన్ సర్కార్ ‘దిశ’ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. మంగళవారం గొల్లపూడిలో సీఎం జగన్ దిశ యాప్ గురించి వివరించారు. దిశ యాప్ ఉంటే మీకు అన్నతోడున్నట్లేనంటూ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ వ్యాఖ్యలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రస్థాయిలో సెటైర్లు వేశారు. ”శవాలపై పేలాలు ఏరుకునేవారిని తలదన్నుతూ అత్యాచారాలపైనా కోట్లు దండుకుంటున్నారు జగన్‌రెడ్డి. తన ఇంటి పక్కనే గ్యాంగ్ రేప్ జరిగి 10 రోజులవుతున్నా నిందితుల్ని పట్టుకోని వైఎస్ జగన్ ప్రభుత్వం.. దిశ యాప్ డౌన్‌లోడ్ నెపంతో సొంత పత్రికకు కోట్ల రూపాయల ప్రకటనలిచ్చారు. సొంత అక్కాచెల్లెళ్లు షర్మిల, సునీతలకే భద్రతలేక ఒకరు తెలంగాణలో, ఇంకొకరు పోలీసుల చుట్టూ తిరుగుతుంటే.. 'అక్కచెల్లెమ్మల భద్రత-జగనన్న ప్రభుత్వ బాధ్యత' అంటూ ఎందుకీ కపట ప్రకటనలు జగన్‌రెడ్డీ?” అని లోకేష్ ప్రశ్నించారు.
”మీ ఇంటి పక్కనే గ్యాంగ్ రేప్ జరిగితే, నిందితుడూ మీ ఇంటిచుట్టూ తిరుగుతుంటే పట్టుకోలేని చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రీ.. కరోనా బాధితుల డిమాండ్ల సాధనకు చంద్రబాబు చేపట్టిన దీక్షని పక్కదారి పట్టించేందుకు, 2020లో ఆమోదం పొందని దిశ చట్టం కోసం అప్పుడే ఆరంభించిన యాప్‌కే మరోసారి డౌన్ లోడ్ కార్యక్రమమా?” అని లోకేష్ విమర్శించారు. ఈ సందర్భంగా గతేడాది ఆగష్టు 2న రాజమహేంద్రవరంలో దిశ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్.. మరికాసేపట్లో నన్నయ్య వర్శిటీకి చేరుకుని దిశ యాప్‌ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి అంటూ నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా పెట్టిన పోస్ట్‌ను నారా లోకేశ్ ట్యాగ్ చేశారు.