- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక్క చాన్స్ ప్లీజ్.. దీదీ, అమిత్ షా విమర్శల పర్వం
దిశ, వెబ్‌డెస్క్ : పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టేందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేపథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బీజేపీ విధానాలను వ్యతిరేకించే వివిధ పార్టీల మద్దతుతో బరిలోకి దిగుతున్న మమతా ఎలాగైనా బెంగాల్ ను కాషాయ పార్టీ చేతిలో పెట్టకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. చాన్స్ దొరికిన ప్రతిసారీ బీజేపీని విధానాలను తీవ్రస్థాయిలో ఎండగడుతోంది. అదే రేంజ్‌లో బీజేపీ సైతం తృణమూల్ కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాలు నిప్పులు చెరుగుతున్నారు.
దీదీపై అమిత్ షా కామెంట్స్..
సీఎం మమతా నినాదాల వల్ల బెంగాల్లో అభివృద్ధి కుంటు పడిందని అమిత్ షా ఆరోపించారు. ఒక్కసారి బీజేపీకి అవకాశమిస్తే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామన్నారు. ఐదేళ్లలో బెంగాల్‌ను చొరబాటు రహితంగా మారుస్తామని అక్కడి ప్రజలకు హామీనిచ్చారు.
బీజేపీ, సువేందుపై దీదీ ఫైర్..
కోల్‌కత్తాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. టీఎంసీని వీడిన సువేందు అధికారిపై కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పు నాదే, సువేందు నిజస్వరూపం తెలుసుకోలేక పోయానని చెప్పుకొచ్చారు. సువేందు కుటుంబం రూ.5వేల కోట్లతో ఓటర్లను కొంటున్నట్లు తెలిసిందని.. అధికారంలోకి వచ్చాక వెంటనే అతనిపై విచారణకు ఆదేశిస్తామని మమతా స్పష్టంచేశారు. ఇక రాష్ట్రంలో బీజేపీ మతతత్వ రాజకీయాలకు తెరలేపుతోందని దీదీ మండిపడ్డారు.