భీమవరం డ్రగ్స్ రాకెట్.. మరో నలుగురి అరెస్ట్

by srinivas |   ( Updated:2020-12-02 00:34:12.0  )
భీమవరం డ్రగ్స్ రాకెట్.. మరో నలుగురి అరెస్ట్
X

దిశ, ఏపీ బ్యూరో : పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డ్రగ్స్​ కేసులో మరో నలుగురు నిందితులను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి జిల్లా ఎస్పీ నారాయణ్ నాయక్ వివరాలు వెల్లడించారు. ఈ కేసులో గత నెల 23వ తేదీన ఆరుగురిని భీమవరం ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేసినట్టు తెలిపారు. ఇందులో మొత్తం 15 మందికి సంబంధం ఉందని గుర్తించినట్లు వివరించారు. వీరిలో కౌశిక్ వర్మ, పృథ్వీరాజ్, ప్రసాద్, రాజీవ్ అనే మరో నలుగురిని అరెస్టు చేశామన్నారు. వీరి నుంచి సుమారు కిలో గంజాయి, మూడు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

Advertisement

Next Story