‘డబుల్ బెడ్రూం’ నిర్మాణ పనుల్లో అపశృతి.. కుప్పకూలిన బెంగాల్ వాసి

by Sumithra |
bengal-vasi
X

దిశ, పరిగి : డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనుల కోసం వచ్చిన ఓ దినసరి కూలీ గుండె పోటుతో ఆదివారం మృతి చెందాడు. దోమ ఎస్ఐ రమేష్ కథనం ప్రకారం..పశ్చిమ బెంగాల్ రాష్ర్టం పరగనాస్ జిల్లాకు చెందిన ముష్యంపూర్ గ్రామానికి చెందిన లక్ష్మణ్ గోష్ (44 ) బతుకు దెరువు కోసం వికారాబాద్ జిల్లా దోమ మండలానికి వలస వచ్చాడు. మండలంలో నిర్మితమవుతున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనుల్లో పనిలో చేరాడు. ఈ క్రమంలోనే ఉన్నట్టుండి ఛాతిలో నొప్పి రావడంతో కిందపడిపోయాడు. వెంటనే పరిగి ప్రభుత్వాస్పత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి లక్ష్మణ్ గోష్ మృతి చెందినట్లు తెలిపారు. మురారీ గోష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు.

Advertisement

Next Story