మైనార్టీలకు సంక్షేమ పథకాలు చట్టబద్ధమే

by Shamantha N |
supreme court
X

న్యూఢిల్లీ: మతపరమైన మైనార్టీ వర్గాలకు సంక్షేమ పథకాలు అందజేయడం చట్ట బద్ధమేనని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఇవి అసమానతలను తగ్గించేందుకు ఉద్దేశించినవని, వీటి వల్ల హిందువులు లేదా ఇతర కమ్యునిటీల హక్కులకు భంగం కలగదని స్పష్టం చేసింది. సంక్షేమ పథకాలు మతం ఆధారంగా ఉండకూడదని సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. భారత రాజ్యాంగంలో ఉన్న లౌకిక ధర్మాలను దృష్టిలో ఉంచుకుని మైనార్టీలకైనా, మెజార్టీ వర్గాలకైనా మతాల ప్రాతిపదికన ప్రభుత్వాలు లబ్ధి చేకూర్చకూడదని పిటిషన్ పేర్కొంది.

కావున, హిందూ కమ్యూనిటీకి ఇవ్వకుండా కేవలం ముస్లిం కమ్యూనిటీకే ప్రత్యేక పథకాలతో లబ్ధి చేకూరుస్తున్నదని, ఇది రాజ్యంగం వ్యతిరేకమని తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ పిటిషన్‌పై అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం.. ప్రస్తుతం అమలవుతున్న పథకాలేవీ రాజ్యాంగంలో పొందుపర్చిన సమానత్వ సూత్రాలకు విరుద్ధంగా లేవని స్పష్టంచేసింది. సంక్షేమ పథకాలు మైనార్టీ వర్గాల్లో అసమానతలు తగ్గించేందుకు, విద్యాస్థాయిని పెంచేందుకు, ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించినవేనని తెలిపింది. పైగా, మైనార్టీ కమ్యూనిటీలోని అందరికీ ఈ పథకాలు వర్తించవని, కేవలం ఆర్థికంగా వెనుకబడినవారు, పిల్లలు, మహిళల కోసమేనని పేర్కొంది. కావున, మైనార్టీలకు సంక్షేమ పథకాలు చట్ట బద్ధమేనని వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed