- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా : బండి సంజయ్
by Shamantha N |
X
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలన్న డిమాండ్‌తో చేపట్టిన ‘గరీబోళ్ల కోసం బీజేపీ దీక్ష’ను వాయిదా వేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ వివిధ మార్గాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన ఒత్తిడి ఫలించిందని, ఆయుష్మాన్ భారత్‌లో చేరాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఆలస్యంగానైనా రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని తెలిపారు.
ఆరోగ్య శ్రీ లో కరోనాను చేర్చాలన్నా డిమాండ్ కొనసాగుతుందని వెల్లడించారు. ఆరోగ్య శ్రీ కవరేజీని రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆరోగ్య శ్రీలో కరోనాను చేర్చకుండా రాష్ట్ర ప్రభుత్వం మొండికేస్తే ఉద్యమ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని ప్రకటించారు.
Advertisement
Next Story