యూపీలో వీకెండ్ లాక్‌డౌన్.. సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా..!

by Shamantha N |
యూపీలో వీకెండ్ లాక్‌డౌన్.. సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా..!
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో వైరస్ వ్యాప్తి కట్టడికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వీకెండ్ కర్ఫ్యూ, డే టైంలో లాక్‌డౌన్ నడుస్తుండగా.. తాజాగా యూపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వీకెండ్ లాక్‌డౌన్ అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7గంటల వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని యూపీ అడిషనల్ చీఫ్ సెక్రెటరీ అవనీష్ కే అవస్తీ మంగళవారం ప్రకటించారు.

అయితే, యూపీలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ఐదు ప్రధాన నగరాల్లో లాక్‌డౌన్ విధించాలని అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిని యూపీ సర్కార్ సుప్రీం కోర్టులో సవాల్ చేయగా, అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. లాక్‌డౌన్ విధించాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా సుప్రీం వ్యాఖ్యానించింది. ఈ ఆదేశాలు వెలువరించిన కొద్దిసేపటికే వీకెండ్ లాక్‌డౌన్ నిర్ణయం తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed