- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వీకెండ్ కర్ఫ్యూ.. మాల్స్, రెస్టారెంట్స్ మూసివేత
న్యూఢిల్లీ : కొవిడ్-19 కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారాంతాల్లో కఠిన ఆంక్షలతో కూడిన కర్ఫ్యూను అమలుచేయనున్నారు. దాంతో పాటు షాపింగ్ మాల్స్, జిమ్స్, రెస్టారెంట్లను మూసివేయనున్నారు. ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం కీలక ప్రకటన చేశారు. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌తో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ నిబంధనలు మీ ఆరోగ్యం దృష్ట్యా తీసుకున్నవే. ఇవి మీకు ఇబ్బందులు కలిగించినా కరోనా చైన్‌ను తెంచాలంటే వీటిని పాటించకతప్పని పరిస్థితి. వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే తక్షణం కొన్ని చర్యలు తీసుకోవాలి. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం..’ అని తెలిపారు.
తాజా మార్గదర్శకాల ప్రకారం.. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఇది అమల్లో ఉంటుంది. కర్ఫ్యూ సమయంలో అత్యవసర సేవలను మాత్రమే అనుమతించనున్నారు. ఇక కర్ఫ్యూ సమయంలో మాల్స్, జిమ్స్, ఆడిటోరియాలు, స్పా సెంటర్లు పూర్తిగా మూతపడనున్నాయి. సినిమా హాళ్లు 30 శాతం కెపాసిటీతో నడవనున్నాయి. రెస్టారెంట్లు, బయట తినడం పూర్తిగా నిషిద్ధం. కానీ హోం డెలివరీకి అనుమతినిచ్చారు. ముందుగా నిర్ణయించుకున్న పెళ్లిల్లకు అనుమతి ఉంది. కానీ కర్ఫ్యూ పాసులు ఉంటేనే వాటిని నిర్వహించుకోవచ్చు. ఢిల్లీలో బుధవారం రికార్డు స్థాయిలో 17,282 కేసులు నమోదుకాగా.. 104 మంది మరణించారు.