ఆ రాశి వారు ఇలా చేస్తే.. భవిష్యత్ బంగారమే!

by Hamsa |
Panchangam
X

తేది : 30, జూన్ 2021
ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్ఠమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : బుధవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : షష్టి
(నిన్న మద్యాహ్నం 1 గం॥ 30 ని॥ నుంచి
ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 23 ని॥ వరకు)
నక్షత్రం : పూర్వాభద్ర
(ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 6 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 2 గం॥ 6 ని॥ వరకు)
యోగము : ఆయుష్మాన్
కరణం : వణిజ
వర్జ్యం : (ఈరోజు ఉదయం 7 గం॥ 46 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 26 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు సాయంత్రం 5 గం॥ 46 ని॥ నుంచి ఈరోజు రాత్రి 7 గం॥ 26 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 11 గం॥ 52 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 44 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 18 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 56 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 4)

మేష రాశి: సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రముఖులతో పరిచయాలు. కొంతమంది ఉద్యోగులకు ప్రమోషన్. ఆఫీసులో పనులను నిర్లక్ష్యం చేయకండి. నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు. ఇంటిలో శుభకార్యాలకు అవకాశం. మీ ఇంటికి కొత్తగా పాప బాబు రాబోతున్నారు ఆనందించండి. అవసరాలకు మాత్రమే ఖర్చు పెట్టండి. మీ పిల్లల చదువులను గమనించండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క మొరటుతనం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.

వృషభ రాశి: ముఖ్యమైన నిర్ణయాలు మీరే తీసుకోండి. కొంతమందికి ఉద్యోగ మార్పు. ఆఫీసు పనులలో అధిక శ్రమ ఉన్నప్పటికీ పనులు సకాలంలో పూర్తి చేస్తారు. తోటి ఉద్యోగులతో వాదోపవాదాలకు దిగకండి. అలాగే వ్యాపారస్తులు కస్టమర్స్ తో సహనంగా మాట్లాడండి. కావలసినంత ధనం చేతికందుతుంది. దాన ధర్మాల వలన దైవ బలం తోడవుతుంది. అధిక శ్రమ వలన ఎసిడిటీ. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క మొరటుతనం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.

మిధున రాశి: సహనం పట్టుదల వహించండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి కొంత మంది ఉద్యోగులకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ అవకాశం. స్నేహితులతో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభాలు. మానవసేవే మాధవసేవ ఇతరులకు సహాయం చేయండి ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. అధిక శ్రమ వలన కాళ్ళనొప్పులు. అనుకోని ఖర్చులు వలన మానసిక అశాంతి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు ఒకరినొకరు తప్పులు పట్టుకోవటం మానేయండి.

కర్కాటక రాశి: ఆత్మవిశ్వాసము పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. కొత్త దంపతుల మధ్య గొడవలు సర్దుకుంటాయి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. ఫిట్ నెస్ పై శ్రద్ధ పెట్టండి. పనికిమాలిన కబుర్లను వదిలేయండి. ఆడంబరాల కోసం ఖర్చు పెట్టకండి. కుటుంబ సభ్యులతో కలిసి మనసు విప్పి మాట్లాడండి ఆఫీసులో పనులు సకాలంలో పూర్తి కావాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. శుభవార్తలు అందుతాయి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు ఒకరినొకరు తప్పులు పట్టుకోవడం మానేయండి.

కన్య రాశి: ఒత్తిడి వలన మానసిక అనారోగ్యం. మెడిటేషన్ ఒక మంచి ఉపాయం. తొందరపడి ఒక నిర్ణయానికి రాకండి. కొంతమంది ఉద్యోగులకు ఆఫీస్ టూర్స్. ఆఫీసు పనులలో తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టండి ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి దానివలన మీకు ఎంతో ఎనర్జీ. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.

సింహరాశి: ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేస్తారు కొంతమందికి ఉద్యోగ మార్పు. కావాల్సినంత ధనం చేతికందుతుంది. ఆరోగ్య పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఫిట్నెస్ పై శ్రద్ధ పెడతారు. డబ్బు విలువ ను గుర్తించండి. పైసా పైసా కూడ పెడితే భవిష్యత్తుకు పనికొస్తుంది. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత గొడవలు మర్చిపోండి. మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు గడపండి.

ధనుస్సు రాశి: మిమ్మల్ని మీరు నమ్మండి. దైవప్రార్థన వలన మానసిక బలం. ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలలో ఆత్మీయుల సలహాలు తీసుకోండి. అనవసరపు దుబారా ఖర్చులను నివారించండి. ఆఫీసులో అదనపు బాధ్యతలు వలన అధిక శ్రమ. అధిక శ్రమ వలన వెన్ను నొప్పి కాళ్ళనొప్పులు. తండ్రిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. పాతబాకీలు వసూలవుతాయి. కొంతమంది ఇంటి మార్పుకై చేస్తున్న ప్రయత్నాలు సఫలం. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.

వృశ్చిక రాశి: మీ తల్లి గారి వైపునుంచి ధన సహాయం లభిస్తుంది. అనుకున్న కార్యాలను అతికష్టం మీద అధిక శ్రమతో సాధిస్తారు. వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభాలు కుటుంబ సభ్యులతో పరుషంగా మాట్లాడకండి వారు చెప్పేది పూర్తిగా వినండి. ఆఫీసులో అత్యవసర పనుల వలన ఎక్కువ సమయం పని చేయవలసి వస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. కొంతమందికి జీతం పెరుగుదల. కొంతమంది ఉద్యోగ మార్పుకై చేస్తున్న ప్రయత్నాలు విఫలం. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.

తులారాశి: అనుకోని ధనలాభం. పాతబాకీలు వసూలవుతాయి. ముఖ్యమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోండి. తోటి ఉద్యోగులతో వాదోపవాదాలకు దిగకండి. కాలాన్ని బట్టి మీరూ మారండి. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. మీ ఇంటికి కొత్తగా పాప బాబు రాబోతున్నారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు వారి శ్రమకు తగిన ఫలితం. ఆఫీసులో పనులను పెండింగ్ లేకుండా సకాలంలో పూర్తి చేయండి లేకుంటే పై అధికారులతో మాటలు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

మకర రాశి: అన్నివిధాలా అనుకూలమైన రోజు. స్థిరాస్థి అమ్మకాలు లాభాలను తెస్తాయి. అవసరాలకు మించి ఖర్చు పెట్టకండి. కుటుంబ సభ్యులతో పరుషంగా మాట్లాడకండి వారు హర్ట్ అవుతారు. మీ పిల్లల ప్రగతి మీకు ఎంతో గర్వకారణం. వారితో గడపడం మీకు ఎంతో ఎనర్జీ ని ఇస్తుంది. కుటుంబంలో శుభకార్యం. మీ ఇంటికి కొత్తగా పాప బాబు రాబోతున్నారు ఆనందించండి ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీతో తగినంత సమయం గడపడం లేదని మానసిక అశాంతి.

కుంభరాశి: తొందరపాటు పనికిరాదు. పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. స్థిరాస్తి వ్యవహారాలలో నిర్ణయాలను వాయిదా వేయండి. అనవసరపు దుబారా ఖర్చులను నివారించండి. వ్యాపారస్తులకు వ్యాపారం లో అనుకోని లాభాలు. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి అపార్ధాలు తొలగిపోతాయి. మీ తల్లి గారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఆఫీసు పనుల్లో అధిక శ్రమ. మీ నిబద్ధతకు అందరి ప్రశంసలు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

మీన రాశి: విద్యార్థులు సమయాన్ని వృధా చేయకండి. బంగారు భవిష్యత్తు కొరకు మరింత కష్టపడండి. వ్యాపారస్తులు ఆర్ధిక విషయాల పట్ల జాగరూకతతో ఉండండి. చిన్ననాటి స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి. దూర ప్రయాణాల వలన ఇబ్బందులు అధిక శ్రమ వలన గొంతు నొప్పి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.

Advertisement

Next Story