- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్లాష్.. ఫ్లాష్.. ఖమ్మంలో పెళ్లి బస్సు బోల్తా…
దిశ, పాలేరు: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పోచారం గ్రామపంచాయతీ శివారు గ్రామం సీతరాంపురం సమీపంలో పెళ్లి బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్రగాయాలు కాగా మరో 13 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదం నుంచి మరో 25 మంది క్షేమంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. సీతారాంపురం గ్రామానికి చెందిన గుంటి వెంకటేశ్వర్లు కూతురు వాణి వివాహాం ముచ్చర్ల గ్రామం కన్నెబొయిన వీరబాబుతో నిశ్చయమైంది.
ఈ వివాహానికి పెళ్లికూతురు వాణితో సహా కుంటుంబీకులు 45 మందితో వరుడి ఇంటికి బయలుదేరి వెళ్లారు. వివాహ అనంతరం స్కూల్ బస్సులో స్వగ్రామానికి తిరిగి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ముత్యాలగూడెం-సీతారాంపురం గ్రామాల మధ్యలోని క్వారీ సమీపంలోకి రాగానే బస్సు స్టీరింగ్ అదుపు తప్పి బోల్తాకొట్టింది. దీంతో బస్సు రోడ్డు నుంచి పంట పొలాల్లోకి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తో సహా మొత్తం బస్సులో 45 మంది ప్రయాణిస్తున్నారు. కాగా ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 13 మందికి స్వల్పంగా గాయపడ్డారు.
స్థానికులు వెంటనే వీరిని అంబులెన్స్ వాహనంలో చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిలో గణేష్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే విషయం తెలుసుకున్న కూసుమంచి ఎస్సై నందీప్, ట్రైనీ ఎస్సై, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో బోల్తా కొట్టిన బస్సును వెలికి తీశారు. దీనితో బంధువులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తుల రోదనలతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.