నేడు ఎన్నారై గృహహింస కేసులపై వెబ్ నార్

by Shyam |   ( Updated:2020-06-29 23:53:22.0  )
నేడు ఎన్నారై గృహహింస కేసులపై వెబ్ నార్
X

దిశ, క్రైమ్ బ్యూరో : నాన్ రెసిడెంట్ ఇండియన్ (ఎన్ఆర్ఐ) జీవిత భాగస్వాముల గృహహింస కేసులను ఉమెన్ సేఫ్టీ విభాగం అడిషనల్ డీజీ స్వాతిలక్రా నేతృత్వంలో వెబ్ నార్ ద్వారా నేడు ఉదయం 11 గంటలకు విచారణ నిర్వహిస్తున్నట్టు డీఐజీ సుమతి తెలిపారు. ఎన్ఆర్ఐ జీవిత భాగస్వాములు / బంధువులను నిందితులుగా పేర్కొన్న కేసులను పరిష్కరించేందుకు ఉమెన్ సేఫ్టీ విభాగంలో గతేడాది ఎన్ ఆర్ఐ సెల్ ను ప్రారంభించామని తెలిపారు. ఈ నెల 20వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 17 పోలీస్ స్టేషన్లలో ఎన్ఆర్ఐ సెల్ ద్వారా 101 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. అందులో 36 కేసులకు చార్జీషీటు వేసినట్టు తెలిపారు. వీరిలో ఏడుగురు తమ పాస్ పోర్టులను న్యాయస్థానాలలో జమ చేయగా, 8 కేసులలో ఎన్నారై జీవిత భాగస్వాములు, బంధువులపై లుక్ అవుట్ సర్క్యులర్లు జారీ చేశామన్నారు. 44 కేసులలో నిందితుల వివరాలను సేకరించి, ఇక్కడకు రావాలని కోరుతూ లేఖలు రాసినట్టు పేర్కొన్నారు. ఇరు పక్షాల అంగీకారంతో ఆరు కేసులు కోర్టు నుంచి సమస్య పరిష్కారం చేసుకున్నట్టు వివరించారు. ఉమెన్ సేఫ్టీ విభాగం కార్యాలయంలో నిర్వహించే ఈ సమావేశానికి లీగల్ అడ్వజర్లు, పోలీస్ అధికారులు, ఎన్జీవోలు, బాధితులు హజరవుతారని అన్నారు.

Advertisement

Next Story