- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపు పీజీ మెడికల్, డెంటల్ కోర్సులకు వెబ్ కౌన్సిలింగ్
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు తుది కౌన్సిలింగ్ (మాప్ అప్) నోటిఫికేషన్ విడుదలైంది. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో భర్తీ కాకుండా మిగిలిపోయిన యాజమాన్య కోటా సీట్లలో చేరేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించేందుకు నోటిఫికేషన్‌ను వర్శిటీ విడుదల చేసింది.
ఈనెల 28న ఉదయం 7గంటల నుంచి అదేరోజు సాయంత్రం 4గంటల వరకు ప్రాధాన్యతా క్రమంలో కళాశాలలవారీగా వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని సూచించింది. యూనివర్సిటీ విడుదల చేసిన తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు ఈ వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలని పేర్కొంది. గత విడత కౌన్సెలింగ్‌లో సీటు అలాట్ అయి జాయిన్ కాని అభ్యర్థులు, కళాశాలలో చేరి డిస్కంటిన్యూ చేసిన అభ్యర్థులు ఈ కౌన్సెలింగ్‌కు అర్హులు కారని పేర్కొంది. ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ కింద ఇప్పటికే చేరిన అభ్యర్థులు కూడా అర్హులు కారని స్పష్టం చేసింది.