బంగాళాఖాతం సమీపంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు మరోసారి వర్ష సూచన

by Mahesh |   ( Updated:2024-09-25 14:45:28.0  )
బంగాళాఖాతం సమీపంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు మరోసారి వర్ష సూచన
X

దిశ, వెబ్ డెస్క్: రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో బంగాళాఖాతం సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావంతో వచ్చే 24 గంటల్లో ఏపీలోని కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇదిలా ఉంటే మంగళవారం ఏపీలోని పలుచోట్ల భారీ వర్షాలు కురవగా.. అనకపాల్లిలో.. 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే ఇటు తెలంగాణలో కూడా మంగళవారం, బుధవారం భారీ వర్షాలు కురిశాయి. ఈ రోజు కూడా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో మరికొద్ది గంటల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed