Weather update today : తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు.. 8 జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ

by Mahesh |   ( Updated:2024-10-11 05:11:43.0  )
Weather update today : తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు.. 8 జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశ వాతావరణ శాఖ (IMD) దేశవ్యాప్తంగా అక్టోబర్ 12-16 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, దక్షిణ అంతర్గత కర్ణాటక, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్‌లలో భారీ వర్షాలు కురుస్తాయని IMD అలర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో నేడు తమిళనాడు, పుదుచ్చేరి లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా.. తమిళనాడు డెల్టా ప్రాంతంలో 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే చెన్నై, పుదుచ్చేరి సహా ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ఇచ్చారు. కాగా

పుదుచ్చేరిలో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవ్యగా.. ప్రభుత్వాస్పత్రి జలదిగ్బంధం చిక్కుకుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు పేషెంట్లను మరో ఆస్పత్రికి తరలించారు. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా వరదలు సంబవిస్తుండటంతో.. చెన్నై, పుదుచ్చేరి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే తమిళనాడు సేలం జిల్లాలో వరద నీరు సబ్‌వేలోకి వచ్చి చేరింది. మరో 24 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.

Advertisement

Next Story