ఏపీలో ఆ నాలుగు రోజులు జాగ్రత్త!

by srinivas |
ఏపీలో ఆ నాలుగు రోజులు జాగ్రత్త!
X

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ మే 25 నుంచి 28 వరకు నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో నమోదయ్యే ఉష్ణోగ్రతల వివరాలు వెల్లడించింది. ఈ నాలుగు రోజుల పాటు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే సోమవారం విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 44 డిగ్రీల సెంటీ గ్రేడ్ నుంచి 46 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించింది. శ్రీకాకుళం , విశాఖపట్టణం, కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో 41 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 43 డిగ్రీ సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది.

మే 26న విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44 డిగ్రీ సెంటీగ్రేడ్‌ల నుంచి 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇక శ్రీకాకుళం, విశాఖపట్టణం, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 42 డిగ్రీ సెంటీగ్రేడ్‌ల నుంచి 43డిగ్రీ సెంటీగ్రేడ్‌ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది.

ఇక ఎల్లుండి మే 27న తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 44డిగ్రీ సెంటీగ్రేడ్‌ల నుంచి 45డిగ్రీ సెంటీగ్రేడ్‌ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 38 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని వెల్లడించింది.

మే 28న తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44 డిగ్రీల నుంచి 46డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందంది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 43డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

రాత్రి పూట కుడా సాధారణం కంటే 1 డిగ్రీ నుంచి 2డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు జిల్లాల యంత్రాంగాలను విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. ఈ మేరకు ప్రజలు కుడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు సూచించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రజలు ఎంతో అత్యవసరమైతే తప్ప బయట రాకూడదని ఆయన హెచ్చరించారు. డీహైడ్రేషన్ భారీన పడకుండా.. ఒఆర్ఎస్, లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలని ఆయన సూచించారు.

Advertisement

Next Story

Most Viewed