దుర్గామాత సమక్షంలో పోలీసుల ఆయుధాలకు పూజ

by Shyam |
SP kotireddy
X

దిశ, మహబూబాబాద్: విజయదశమి పండుగ జిల్లా ప్రజలకు అన్ని రంగాల్లో విజయం సాధించాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆకాంక్షించారు. శుక్రవారం విజయదశమి పర్వదినం సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఆర్మీ రిజర్వ్ విభాగంలో ఎస్పీ ఆయుధ పూజ, వాహన పూజ చేశారు. శక్తికి ప్రతీకగా నిలిచే దుర్గామాత సమక్షంలో ప్రతీ ఆయుధానికి ఎంతో శక్తి కలిగి ఉంటుందని అలాంటి విజయాలను చేకూర్చే విజయదశమి పర్వదినోత్సవం అందరికీ సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు. ఈ పూజా కార్యక్రమాలలో దీక్షిత్ రెడ్డి, ముఖేష్ రెడ్డి, మహబూబాబాద్ సబ్ డివిజన్ డీఎస్పీ సదయ్య, ఏఆర్ డీఎస్పీ జనార్దన్ రెడ్డి, సీఐ సురేందర్, అర్‌ఐలు నరసయ్య, పూర్ణచందర్, లాల్ బాబు, సురేష్, టౌన్ సీఐ వెంకటరత్నం, రురల్ సీఐ రవికుమార్, సీసీఎస్ సీఐ వెంకటేశ్వర రావు, ఏఆర్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story