చెప్పినట్టు వినకపోతే కేసులు పెడుతాం.. సీఐ సీరియస్ వార్నింగ్

by Sridhar Babu |
Parakala-Ci1
X

దిశ, పరకాల: నూతన సంవత్సర వేడుకలను ప్రజలందరూ ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని పరకాల పోలీస్ సీఐ పుల్యాల కిషన్ కోరారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఒమిక్రాన్ కొత్త వేరియంట్ రోజురోజుకు ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం జనవరి రెండవ తేదీ వరకు ఆంక్షలు విధించిందన్నారు. ఈనెల 31న రాత్రి పరకాల పోలీస్ స్టేషన్ పరిధిలోని పరకాల టౌన్, పరకాల మండలం, నడికుడ మండల పరిధిలోని గ్రామాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. బ్రీత్ అనలైజర్ లతో తనిఖీలు నిర్వహిస్తామని, మద్యం సేవించి వాహనాలు నడిపితే వాహనాలు సీజ్ చేయడంతోపాటు కేసులు నమోదు చేస్తామన్నారు. నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని, వీధుల్లోకి రావద్దన్నారు. కోవిడ్ మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో ర్యాలీలను ప్రభుత్వం నిషేధించిందన్నారు. నిబంధనలు ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐలు ప్రశాంత్ బాబు, హరికృష్ణ, శివకృష్ణలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed