- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తాం : మంత్రి హరీశ్‌రావు
దిశ, తెలంగాణ బ్యూరో : జనాలు గుమిగూడకుండా ఆంక్షలు విధించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను గౌరవిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. కోర్టు ఉత్తర్వులు కాఫీ అందగానే మంత్రి వర్గంలో చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రజల ఆరోగ్యం రక్షించడమే ప్రభుత్వం అంతిమ లక్ష్యమని చెప్పారు. మరోవైపు వ్యాక్సిన్, కరోనా కట్టడి చర్యలపై త్వరలోనే కేంద్రంతో చర్చిస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని దుర్గాబాయి దేశ్ముఖ్ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లను వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తరఫు నుంచి దుర్గాబాయి ఆస్పత్రికి తోడ్పాటు అందిస్తామన్నారు. విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. బూస్టర్ డోస్, పిల్లల టీకాపై కేంద్రం నిర్ణయం తీసుకోలేదన్నారు. ఆరోగ్య శ్రీ బిల్లులను ప్రతి నెలా వేగంగా చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు.