'రాజీనామా చేస్తాం'

by Shyam |
రాజీనామా చేస్తాం
X

దిశ, నిజామాబాద్: నిజామాబాద్ రూరల్ మండలం రాంనగర్ గ్రామ శీవారులో ఉన్న అసైన్డ్ భూమిలో పేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు పట్టాలు ఇవ్వాలని.. లేకపోతే తాము తమ పదవులకు రాజీనామా చేస్తామని రాంనగర్ గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు హెచ్చరించారు. బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆర్షియా సమ్రీన్, వార్డు సభ్యులు మాట్లాడుతూ… గ్రామ పంచాయితీ పరిధిలోని ఉన్న అసైన్డ్ భూమిలో 9.38 ఎకరాలలో పేదలకు పట్టాలు ఇవ్వకుండా గోదాముల నిర్మాణం చేపడతామంటే ఊరుకునేది లేదన్నారు. గ్రామంలో ఇండ్లు లేని నిరుపేదలు ఉండగా.. వారిని కాదని గోదాములు నిర్మించడం సబబుకాదన్నారు. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పునారాలోచన చేయాలన్నారు. గ్రామ శివారులో 1033 సర్వే నంబర్ లో 54 ఎకరాల అసైండ్ భూమి ఉండగా, అందులో కొంతవరకు అధికార పార్టీ నేతలు తమ అనుచరులపై పట్టాలు చేయించుకున్నారని వారు ఆరోపించారు. ఈ విషయంపై తహశీల్దార్ ప్రశాంత్ ను వివరణ కోరగా.. మండలానికి ఒక గోదామును నిర్మించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు అసెన్డ్ భూములను రెజ్యూమ్ చేశామని, ఈ విషయంలో ఎవరి ఒత్తిడి లేదని చెప్పారు.

Advertisement

Next Story