కేంద్ర వైఖరిని ఖండిస్తూ మహాధర్నా చేస్తాం: సీఎం కేసీఆర్

by Anukaran |
CM KCR
X

దిశ, డైనమిక్ బ్యూరో : ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి, ప్రాంతానికో నీతి పాటిస్తోందని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. మంగళవారం టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పంజాబ్‌లో పండించిన ధాన్యాన్ని ఎలాగైతే పూర్తిగా కొంటున్నారో తెలంగాణ ధాన్యాన్ని కూడా కొనాలని డిమాండ్ చేశారు. లేకపోతే కేంద్రం కొంటుందా? లేదా? అన్న విషయాన్ని సూటిగా చెప్పాలన్నారు. అంతేకాకుండా వచ్చే యాసంగిలో వరి వేయాలని రైతులతో తప్పుగా మాట్లాడిన బండి సంజయ్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర వైఖరిని ఖండిస్తూ ఈ నెల 18 ఇందిరా పార్కులో టీఆర్ఎస్ మహాధర్నా చేపట్టన్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఈ ధర్నాలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులంతా ఇందులో పాల్గొంటారని పేర్కొన్నారు.

Advertisement

Next Story