ఉద్యోగ నోటిఫికేషన్ వేస్తాం.. అసెంబ్లీలో సీఎం కేసీఆర్

by Anukaran |
ఉద్యోగ నోటిఫికేషన్ వేస్తాం.. అసెంబ్లీలో సీఎం కేసీఆర్
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలోని నిరుద్యోగులకు అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. రాబోయే 2,3 నెలల్లో ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రకటించారు. దసరా తర్వాత రాష్ట్రంలోని ఉద్యోగులతో చర్చలు జరిపి ఉద్యోగాల భర్తీ చేపడుతామన్నారు. కొత్త జోనల్ విధానం ఇటీవల అమలులోకి వచ్చిన నేపథ్యంలో 33 జిల్లాల ప్రజలకు ఆ జిల్లాల్లోనే ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎక్కడివారికి అక్కడ ఉద్యోగాలు వచ్చే విధంగా, 95 శాతం లోకల్ యువతకే అవకాశం ఇచ్చేలా నూతన జోనల్ వ్యవస్థను తీసుకొచ్చామని కేసీఆర్ మరోసారి గుర్తు చేశారు.

మార్చిలోపు 100 నియోజకవర్గాల్లో దళితబంధు

అనంతరం దళితబంధుపై జరిగిన చర్చలో మాట్లాడుతూ.. దళితబంధు పథకాన్ని హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం తీసుకొచ్చామని ప్రతి ఒక్కరూ అంటున్నారని, కానీ దీనికి బీజం 1986లోనే పురుడు పోసుకుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దళితుల కోసం గత ప్రభుత్వాలు కొంత చేశాయి కానీ వారి అభివృద్ధి జరగలేదని తెలిపారు. రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. మార్చిలోపు దళితబంధును 100 నియోజకవర్గాల్లో అమలు చేస్తామని వెల్లడించారు. దళితబంధు పథకానికి దాదాపు రూ.3 వేల కోట్లు ఖర్చు చేస్తామని, వచ్చే బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. నియోజకవర్గానికి 100 మందిని ఎంపిక చేసే బాధ్యత ఎమ్మెల్యేదేనని సీఎం కేసీఆర్​తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు సైతం దళితబంధు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

దళిత బస్తీలన్నీ ధనిక బస్తీలు చేయడమే ధ్యేయం

రాష్ట్రంలోని దళిత బస్తీలన్నీ ధనిక బస్తీలు కావాలనేదే ధ్యేయం అన్నారు. కులాల వర్గీకరణ మీద తీర్మానం చేసి ఏళ్లు గడుస్తున్నా కేంద్రం నుంచి స్పందన రాలేదని, బీసీ కులగణన కూడా చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిద్దామని సీఎం తెలిపారు.

Advertisement

Next Story