- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దర్గా పరిసరాలను అభివృద్ధి చేస్తాం
దిశ ప్రతినిధి, హైదరాబాద్: జహంగీర్ పీర్ దర్గా పరిసరాలను మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని, అజ్మీర్ లో రుబాత్ నిర్మాణానికున్న అడ్డంకులను తొందర్లోనే తొలగిస్తామని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జహంగీర్ పీర్ దర్గా అభివృద్ధి,అజ్మీర్‌లో రుబాత్, నాంపల్లిలో అనీసుల్ గుర్భా నిర్మాణాల విషయమై అధికారులతో మంత్రి శుక్రవారం సమీక్ష సమావేశం జరిపారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో, ముఖ్యమంత్రి పదవి చేపట్టాక కేసీఆర్ జహంగీర్ పీర్ దర్గాను సందర్శించి మొక్కు చెల్లించుకున్నారని గుర్తు చేశారు. ప్రజలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు దర్గాను రూ 50 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు, ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ఆయన ఆదేశించారు.
దర్గా పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దేందుకు, భక్తుల సౌకర్యార్థం షెడ్లు, వంట, భోజనాల గదులు, దుకాణాలను నిర్మించాలని సూచించారు. అలాగే పిల్లల ఆహ్లాదం కోసం ఆటస్థలం, బొమ్మలతో పాటు వాహనాలను నిలిపేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. రాజస్థాన్ లోని అజ్మీర్ ఖాజా మొయినుద్దీన్ ఛిస్తీ దర్గా వద్ద తెలంగాణ నుంచి వెళ్లే భక్తుల కోసం తలపెట్టిన రుబాత్ నిర్మాణానికి ఎదురైన అడ్డంకుల గురించి మంత్రికి అధికారులు వివరించారు. సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి అనుమతితో అజ్మీర్‌కు వెళ్లేందుకు చర్యలు తీసుకుంటానని మంత్రి చెప్పారు. నగరంలోని నాంపల్లి రైల్వేస్టేషన్ వద్ద రూ 20కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న అనీసుల్ గుర్భా పనుల వేగాన్ని పెంచాలని మంత్రి ఈశ్వర్ అధికారులను సూచించారు.