- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కరోనా పేషెంట్లకు అండగా ఉంటాం’
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలందిస్తూ ప్రభుత్వం అండగా ఉంటుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం హోమంత్రి మహమూద్ అలీతో కలిసి ఆయన నిమ్స్, చెస్ట్ ఆసుపత్రుల్లోని కరోనా వార్డ్‌లను పరిశీలించారు. చెస్ట్ హాస్పిటల్ లో సీటీ స్కాన్, అల్ట్రా సౌండ్ పరికరాల ఏర్పాటు చేసే అంశాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. హైదరాబాద్ లో 94 కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 9.10 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ ను వేయడం జరిగిందన్నారు. నగరంలో ఫీవర్ సర్వేను మొదటి విడతలో సుమారు 19 లక్షల ఇండ్ల నిర్వహించామని రెండో విడత ఫీవర్ సర్వే ను రెండు రోజుల క్రితం ప్రారంభించడం జరిగిందని చెప్పారు. కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని తెలిపారు.
వ్యాధి వ్యాప్తి తగ్గడంతో కొత్త కేసుల నమోదు సంఖ్య కూడా తగ్గిపోయిందన్నారు. ప్రభుత్వం తీసుకునే చర్యలకు ప్రజలు సహకరించి కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అవసరమైతే తప్ప ఇండ్లలో నుండి బయటకు రావద్దని సూచించారు. లాక్ డౌన్ లో ఆహారం కోసం ఇబ్బందులు తలెత్తకుండా నగరంలో 250 అన్నపూర్ణ కేంద్రాల ద్వారా ప్రతిరోజూ 40 వేల మందికి ఉచితంగా భోజన సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. నిమ్స్ హాస్పిటల్‌లో 1060 మంది కొవిడ్ చికిత్సకోసం చేరగా, ప్రస్తుతం 127 మంది చికిత్స పొందుతున్నారని, మిగిలిన వారు కోలుకొని డిశ్చార్జి అయినారని వైద్యులు మంత్రులకు వివరించారు. చెస్ట్ హాస్పిటల్ లో 1375 మంది కరోనా చికిత్స కోసం చేరగా, 1000 మందికి పైగా కోలుకొని డిశ్చార్జి అయినట్లు వైద్యులు వివరించారు. ఈ పర్యటనలలో కలెక్టర్ శ్వేతా మహంతి, జోనల్ కమిషనర్ ప్రావిణ్య, రవికిరణ్, హైదరాబాదు జిల్లా వైద్యాధికారి వెంకట్, నిమ్స్ సూపరింటెండెంట్ సత్యనారాయణ, డ్రగ్స్ జాయింట్ డైరెక్టర్ రాం ధన్ తదితరులు ఉన్నారు.