అనాథ పిల్లలకు అండగా ఉంటాం: మంత్రి

by Aamani |
Minister Indra Karan Reddy
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : క‌రోనా సోకి త‌ల్లిదండ్రుల‌ను కొల్పోయి అనాథలుగా మారిన పిల్లల‌కు తెలంగాణ‌ ప్రభుత్వం అండ‌గా ఉంటుంద‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి అన్నారు. మంగ‌ళ‌వారం నిర్మల్ ప‌ట్టణంలో బాల‌ల సహాయ వాణి వాహనాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. సీయం కేసీఆర్ ఆదేశాల మేర‌కు.. కొవిడ్ తో క‌న్నవారిని కొల్పోయిన పిల‌ల్లను చేర‌దీసి సంర‌క్షించేందుకు చ‌ర్యలు తీసుకుంటున్నామ‌న్నారు.

కాల్ సెంట‌ర్ కు కాల్ వ‌చ్చిన 24 గంట‌ల్లో అనాథ పిల్లల‌ను బాల‌ల సంర‌క్షణ‌ కేంద్రానికి త‌ర‌లిస్తార‌ని చెప్పారు. బాలిక‌ల‌ను కేజీవీబీ విద్యాల‌యానికి, బాలుర‌ను భైంసాలోని వివేకానంద స్కూల్ లో చేర్పించి విద్యను అందిస్తామ‌ని పేర్కొన్నారు. అనాథ పిల్లలు రోడ్డున ప‌డితే సమాజానికి నష్టమని, అటువంటి పిల్లలను చేరదీసి వారికి విద్యాబద్దులు నేర్పిస్తే ఉత్తమ పౌరులను అందించిన వారమవుతామన్నారు.

Advertisement

Next Story

Most Viewed