- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాక్ డౌన్ పాటించకపోతే తప్పదు భారీ మూల్యం : విష్ణు
దిశ, వెబ్‌డెస్క్: మంచు విష్ణు…. లాక్ డౌన్ పీరియడ్ చాలా ముఖ్యమని చెబుతున్నాడు.. 60 ఏళ్లు దాటిన వారికి కోవిడ్19 వ్యాధి వచ్చిందంటే కోలుకోవడం చాలా కష్టమని హెచ్చరిస్తున్నాడు. ప్రతీ ఒక్కరు ఇంట్లోనే ఉండి లాక్ డౌన్ పీరియడ్‌ను విజయవంతం చేయాలని కోరుతున్నాడు. పోలీసులు కూడా మనలాంటి మనుషులే .. వారికి కూడా కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉంది.. కానీ మన క్షేమం కోసం వాళ్లు పనిచేస్తున్నారు. మనం ఇళ్లు దాటి బయటకు వస్తే కరోనాతో ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉందనే ఆంక్షలు పెడుతున్నారు… వాళ్లు అంతగా ఎందుకు చెప్తున్నారో ఆలోచించాలని సూచించాడు.తనకు కూడా లాక్ డౌన్ పీరియడ్ కష్టంగానే ఉందని… కానీ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఖచ్చితంగా ఫాలో కావాలని సూచించాడు. కనీసం మీతో కుటుంబీకులైనా ఇంట్లో ఉన్నారు… నా భార్యా, పిల్లలు ఇప్పుడు వేరే దేశంలో ఉన్నారని తెలిపాడు. వెంటనే వెళ్లి తీసుకొద్దామన్నా కూడా ఫ్లైట్స్ లేవని… అక్కడ విజిటర్స్‌ను అనుమతించడం లేదన్నాడు. నాకు పిల్లలతో అటాచ్‌మెంట్ ఎక్కువ… వాళ్లు పుట్టినప్పటి నుంచి రాత్రి వాళ్లతోనే పడుకునే వాడినని.. షూటింగ్ ముగిశాక ఎంత రాత్రైనా పిల్లలను చూసేందుకు ఇంటికొచ్చేసే వాడినని తెలిపాడు. ఇప్పుడు ఒంటరిగా ఉందని…. అయినా కూడా లాక్ డౌన్ పాటిస్తానని చెప్పాడు. ఇప్పుడు లాక్ డౌన్ పాటిస్తేనే.. కరోనా ప్రభావం తగ్గుతుందని… తర్వాత కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చన్నాడు. గవర్నమెంట్ సూచనల ప్రకారం రూల్స్ పాటించకుండా ఉంటే మీతో పాటు, మీ కుటుంబీకులు కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇంట్లోనే క్షేమంగా ఉంటూ… మీ కుటుంబాన్ని, దేశాన్ని కాపాడాలని సూచించారు.