యూజర్ డేటా ఎవరికీ షేర్ చేయలేదు : టిక్‌‌టాక్

by Harish |
యూజర్ డేటా ఎవరికీ షేర్ చేయలేదు : టిక్‌‌టాక్
X

దిశ, వెబ్‌డెస్క్ : అతి తక్కువ కాలంలోనే క్రేజీ యాప్‌గా కోట్లాది మంది యూజర్లను ఆకర్షించిన యాప్ టిక్‌టాక్. దేశ భద్రతకు ముప్పు ఉందంటూ టిక్‌టాక్, హలో, వియ్‌చాట్ సహా చైనాకి చెందిన 59 యాప్‌లపై సోమవారం భారత ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే టిక్‌టాక్, హలో యాప్‌లను గూగుల్, యాపిల్ స్టోర్ల నుంచి కూడా తొలగించారు. అయితే భారత ప్రభుత్వం విధించిన నిషేధంపై టిక్‌టాక్ ఇండియా హెడ్ నిఖిల్ గాంధీ తాజాగా స్పందించారు.

చైనా యాప్‌ టిక్‌టాక్‌ను మన దేశంలో బ్యాన్‌ చేయడంపై టిక్‌టాక్‌ ఇండియా హెడ్‌ నిఖిల్‌ గాంధీ భారత ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు. ‘యూజర్ల ఇన్ఫర్మేషన్‌ను ఏ ఫారెన్‌ కంట్రీస్‌తో షేర్‌‌ చేసుకోలేదు. ఆఖరికి చైనా గవర్నమెంట్‌కు కూడా ఎలాంటి డేటా ఇవ్వలేదు. టిక్‌టాక్‌.. ఇండియన్‌ లా ప్రకారమే ఉంది. యూజర్స్‌ ప్రైవసీ, ఇంటిగ్రిటీకి ఇంపార్టెన్స్‌ ఇస్తాం. ఈ విషయంపై చర్చలు జరిపేందుకు కంపెనీ.. ప్రభుత్వ వర్గాలను ఆహ్వానించింది’ అని నిఖిల్‌ గాంధీ చెప్పారు.

మరో చైనా యాప్ క్లబ్ ఫ్యాక్టరీ కూడా కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధంపై స్పందించింది. ‘క్లబ్ ఫ్యాక్టరీ ఇండియన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే నడుస్తోంది. యూజర్ల సెక్యురిటీ, ప్రైవసీ విషయంలో చాలా కచ్చితంగా ఉంటుంది. ఇప్పటివరకు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదు. ఎంతోమంది ఇండియన్స్‌కు డైరెక్ట్ ఎంప్లాయ్‌మెంట్ కల్పించాం. ఇన్‌డైరెక్ట్‌గానూ వందలాది మంది ఎంప్లాయ్‌మెంట్ పొందారు. మా కంపెనీలో 30 వేల మంది రిజిస్టర్డ్ ఇండియన్ సెల్లార్స్ ఉన్నారు. కమీషన్ ఫీ వసూలు చేయకుండా ఇండియన్ సెల్లర్స్‌ అభివృద్ధికి కారణమవుతున్న ఏకైక ఈ కామర్స్.. క్లబ్ ఫ్యాక్టరీనే. ప్రభుత్వంతో చర్చించి, మళ్లీ మా వర్క్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాం’ అని క్లబ్ ఫ్యాక్టరీ పేర్కొంది.

Advertisement

Next Story