- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దమ్ముంటే కేంద్రంతో పోరాటానికి సిద్ధం కండి : గండ్రవెంకటరమణారెడ్డి
దిశ, భూపాలపల్లి : వర్షాకాలంలో పండించిన వరి ధాన్యాన్ని గింజ లేకుండా కొనుగోలు చేస్తామని , రైతులుఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని భూపాలపల్లి శాసన సభ్యులు వెంకటరమణ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో భూపాలపల్లి జిల్లా కేంద్రంలో, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన 12 మందికి 5 లక్షల 73 వేల పరిహారం అందించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు మాట్లాడడానికి, ఎలాంటి అంశాలు లేకపోవడం వలన వరి ధాన్యం కొనుగోలు అంశాన్ని పట్టుకొని రాద్ధాంతం చేస్తున్నాయని, కళ్లాల చుట్టూ తిరిగి మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన ప్రతిపక్షాల పని తీరునుఎద్దేవా చేశారు.
రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, భూపాలపల్లి జిల్లా ను కేంద్ర ప్రభుత్వం రైస్ పంపిణీ చేయడానికి పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్నదని అందుకోసమే జిల్లాలో కొనుగోలు కొంచెం ఆలస్యం అయిందని అన్నారు. రైస్‌లో మినరల్ కలపాలని ప్రభుత్వం ఆదేశించిందని దానికి అనుకూలంగా మిల్లర్లతో నేడు కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసి వారికి తగు సూచనలు ఇవ్వడంతో పాటు అవసరమైన వారికి ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేయడానికి ముందుటదన్నారు. నేడు రైస్ మిల్ యజమానులతో మాట్లాడి రైస్ అలాట్మెంట్ చేయడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని రైతులకు ఎల్లవేళలా బాసటగా ఉంటుందని ఆయన అన్నారు.
యాసంగి ధాన్యం పై కేంద్ర ప్రభుత్వ పోరాటానికి రండి
యాసంగి వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందని యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో పోరాటానికి అవసరమైతే కలిసి రావాలి తప్ప, కేంద్ర ప్రభుత్వం పై పోరాడిన ప్రతి పక్షాలు టీఆర్ఎస్ ప్రభుత్వం పై నిందలు వేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌తో రాష్ట్ర మంత్రులు పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నారని ఆయన తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటే యాసంగి లో వరి ధాన్యం పండించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఈ సమావేశంలో శాసనసభ్యులతో పాటు మున్సిపల్ చైర్మన్ వెంకట సిద్ధూ రాణి, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు మున్సిపల్ కౌన్సిలర్ ఎంపిటిసిలు పాల్గొన్నారు