తెలంగాణ సోన ఆరోగ్యకరమైంది: మంత్రి నిరంజన్‌రెడ్డి

by Shyam |
తెలంగాణ సోన ఆరోగ్యకరమైంది: మంత్రి నిరంజన్‌రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర పంటలకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చేందుకు కృషి చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ సోన, మార్కెటింగ్ వ్యూహంపై ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ రూపొందించిన నివేదికను మంత్రి మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైతు ఉత్పత్తులకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నామని, ఆరునెలలుగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తో కలిసి ప్రభుత్వం, ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అడుగులు వేస్తుందన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తెలంగాణ రైతు ఉత్పత్తులు, రైతుల కష్టానికి తగిన ఫలితం దక్కాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, మన పంట ఉత్పత్తుల గొప్పతనం వినియోగదారులు, ప్రజలకు తెలుపుతున్నామన్నారు.

తెలంగాణ సోన ఖ్యాతి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి వెళ్లాల్సి ఉందని, తెలంగాణ సోన ఆరోగ్యకరమైనదని, అధిక ప్రొటీన్లు (8 శాతం), అధికశాతం పీచు (3 శాతం), తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ (51.5 శాతం)ఉంటుందని వివరించారు. తక్కువ నీటి వినియోగం ఉంటుందని, ఇతర సన్నరకాలకన్నా 30రోజులు ముందుగా కోతకు వస్తుందని, యాసంగి, వానాకాలంలో సాగుకు అనుకూలంగా ఉంటుందని, తెగుళ్లను తట్టుకునే వంగడమని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ సోన గతంలో 4లక్షల ఎకరాలలో సాగుచేయగా, రాష్ట్రంలో ఈ ఏడాది 10లక్షల ఎకరాలకు పెరిగిందని, ఏడు రాష్ట్రాలో మరో 5లక్షల ఎకరాలలో సాగు చేస్తున్నారన్నారు.

Advertisement

Next Story

Most Viewed