- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మనందరం డాక్టర్లకు అండగా ఉందాం : చీఫ్ విప్ వినయ్ భాస్కర్
దిశ, వరంగల్: కరోనా వైరస్‌పై ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వైద్యులకు మనందరం అండగా నిలువాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌ను సందర్శించిన ఆయన డాక్టర్లకు పీపీ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంజీఎం కొవిడ్-19 విభాగంలో పనిచేస్తున్న డాక్టర్లకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఎంజీఎంలో పీపీ కిట్స్ కొరత ఉందని తెలియగానే జయ నర్సింగ్ హోమ్ అధినేత నర్సింగ్‌రావుతో మాట్లాడి 100 పీపీ కిట్స్‌ను కోవిడ్-19 విభాగం ఇన్‌ఛార్జ్ చంద్రశేఖర్‌కు అందించామన్నారు. దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కొవిడ్-19పై పోరాడుతున్న వారికి అండగా నిలవాలని కోరారు. నగరంలో కరోనా పాజిటివ్ వచ్చిన బాధితులందరూ వైద్యులకు సహకరించి, తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలెవరూ బయటకు రాకూడదని స్పష్టంచేశారు.
Tags: doctors, support, corona,lockdown, chief whip vinay bhaskar