- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాహ్.. మీ ఆలోచన బాగుంది
దిశ, కరీంనగర్: కరోనా తెచ్చిన కష్టం వల్ల చిన్నారులు కూడా అవస్థలు పడుతున్నారు. వారి కోర్కెలు తీర్చలేక చిన్నారుల తల్లిదండ్రులు పడే బాధ అంతా ఇంతా కాదు. సాధారణ రోజుల్లోనే ఇబ్బందులు పడే పేరెంట్స్ కు లాక్ డౌన్ తెచ్చిపెట్టిన కష్టం మాములుగా లేదనే చెప్పాలి. ఆ చిన్ని మనసులు చిన్నబుచ్చుకోకుండా ఉండేందుకు ఓ తండ్రి చేసిన వినూత్న ప్రయత్నం అందరినీ ఆకర్షిస్తోన్నది. ఇంతకీ ఆ చిన్నారి కోరిన కోరిక ఏంటి ? ఆ తండ్రి చేసిన ప్రయత్నం ఏంటో తెలుసా..? అయితే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.
సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన మందాడి రవి, కావ్య దంపతులకు ఇద్దరు కూతుర్లు. వీరు ప్రస్తుతం తంగళ్ళపల్లి మండల కేంద్రంలో నివాసముంటున్నారు. వీరి చిన్న కూతురు ఆరాధ్య తన బర్త్ డే వేడుకను ఘనంగా చేయాలని తండ్రిని కోరింది. లాక్ డౌన్ నేపథ్యంలో బేకరీలు మూసివేయడంతో కేక్ దొరికే పరిస్థితి లేకుండా పోయింది. అయినా తన కూతురు కోరికను ఎలాగైనా నెరవేర్చాలనుకున్నాడు ఆ తండ్రి. కేక్ కు ప్రత్యామ్నాయం ఎలా అని ఆలోచించసాగాడు. చివరకు సిరిసిల్ల పట్టణంలో విక్రయానికి సిద్ధంగా ఉన్న పుచ్చ కాయలపై రవి దృష్టి పడింది. వెంటనే ఓ పుచ్చకాయను కొనుగోలు చేసి దాన్ని కేకులుగా మార్చాడు. పుచ్చకాయను మధ్యలోకి కట్ చేసి మధ్యలో క్యాండిల్ ఏర్పాటు చేసి ఆరాధ్య బర్త్ డేను ఘనంగా నిర్వహించాడు.
ప్రాక్టికల్ గా చూపించాడు..
లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ సోమవారం తంగళ్లపల్లిలోని తన నివాస గృహంలో కూతురు ఆరాధ్యతో పుచ్చకాయ కేక్ కట్ చేయించి జన్మదిన వేడుకలు నిర్వహించడాన్ని చూసిన స్థానికులు రవి ఆలోచనను మెచ్చుకోలేకుండా ఉండలేకపోయారు. అటు కూతురు కోరిక ప్రకారం బర్త్ డే చేసినట్టయింది.. ఇటు నేచురల్ ఫ్రూట్ కేక్ ను తయారు చేసినట్టయిందని రవి ఫ్రెండ్స్ కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా లాక్ డౌన్ తో రవి తనలోని ఆలోచనలకు పదును పెట్టి సరికొత్తగా జన్మదిన వేడుకలు చేయవచ్చని సమాజానికి ప్రాక్టికల్ గా చూపించాడు.
tags: Karimnagar, Watermelon Cake, Daughter Birthday, Ravi, Thangallapally, Lockdown Effect