దంచికొట్టిన వాన.. ఉరకలేస్తున్న జలపాతం

by Shyam |
దంచికొట్టిన వాన.. ఉరకలేస్తున్న జలపాతం
X

దిశ, అచ్చంపేట : జిల్లాలోని నల్లమల ప్రాంతం అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్, పదరా, ఉప్పునూతల, అచ్చంపేట తదితర మండలాల్లో శుక్రవారం వాన దంచి కొట్టింది. దీంతో పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు ఉరకలు వేస్తున్నాయి.

ప్రధానంగా పదరా మండలంలోని సమీపంలో వాగులు ఉప్పొంగుతున్నాయి. ఉడిమిల్ల గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో శివాలయం వద్ద ఉన్న జలపాతం పర్యాటకులను మరింతగా ఆకర్షిస్తోంది. వరద నీరు జలపాతం మీద నుంచి జాలువారుతూ కళ్లను తిప్పుకోకుండా చేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed