- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేరుకే పెద్దాసుపత్రి.. చినుకు తడికే ‘చెరువును’ తలపిస్తున్న వైనం..
దిశ, భూపాలపల్లి : భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వంద పడకల ఆసుపత్రికి వెళ్లడానికి ‘దారి’ లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. సోమవారం కురిసిన వర్షం వల్ల ఆసుపత్రి చుట్టూ నీరు నిలిచిపోవడంతో ఆసుపత్రిలోకి వెళ్లడానికి వీలు లేకుండా పోయింది. అయితే, ప్రస్తుతం ఆసుపత్రి అధికారికంగా ప్రారంభం కాకపోయినప్పటికీ.. కరోనా సమయంలో బాధితులు ఉండటానికి ఆసుపత్రిలో సౌకర్యాలు ఏర్పాటు చేశారు. దీంతో ఆసుపత్రిలో రోగులకు సేవలు అందిస్తున్నారు.
పేరుకే పెద్దాసుపత్రి అయినప్పటికీ ఆసుపత్రి చుట్టూ.. నీరు చేరి జలమయమై ద్వీపంలా కనిపిస్తోంది. ఈ విషయంపై అధికారులు స్పందించడం లేదు. అయితే, ఆసుపత్రి విషయంలో తగు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు తమకేమి పట్టనట్టుగా చోద్యం చూస్తున్నారు. చుట్టూ నీరు చేరడంతో ఆసుపత్రి ఆవరణలోకి 108 సర్వీసులు, ప్రైవేట్ అంబులెన్స్‌లు, వాహనాలు వెళ్లకుండా అయిపోయింది. ఈ క్రమంలో రోగులు ఆసుపత్రికి వెళ్లడం ఇబ్బందిగా మారింది. జిల్లా కలెక్టర్ వెంటనే కల్పించుకుని ఆసుపత్రి విషయంలో చొరవ తీసుకుని చుట్టూ నీరు నిలువకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.