మంజీరాలోకి వరద నీరు

by  |
మంజీరాలోకి వరద నీరు
X

దిశ, సంగారెడ్డి: ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో మంజీరాలోకి వదరనీరు వచ్చి చేరుతోంది. గోదావరికి ఉపనదిగా ఉన్న మంజీరా నది కర్ణాటక నుంచి తెలంగాణలోకి నాగల్ గిద్ద మండలం గౌడ్ గాం, జన్వాడ వద్ద ప్రవేశిస్తుంది. గతేడాది వర్షాలు సక్రమంగా కురవకపోవడంతో మంజీరాలోకి నీరు అంతంత మాత్రమే చేరింది. వారం రోజులుగా ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో సోమవారం తెల్లవారుజూము నుంచి వదరనీరు మంజీరాలోకి పరుగులు తీస్తున్నది. వరద నీటి రాకతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed