- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్విచ్ ఆన్ చేయకుండానే బోరు నుండి నీళ్లు
దిశ,వెబ్‌డెస్క్ : నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పల్లవోలు గ్రామంలో ఒక బోరు బావి నుంచి వేడినీరు వస్తోంది. స్విచ్ ఆన్ చేయకుండానే బోరులోంచి నీరు రావడంతో దీనిని చూడటానికి జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. కొందరు వ్యక్తులు ఇక్కడికి వచ్చి స్నానాలు చేయడం విశేషం. కాని నిపుణుల వివరాల ప్రకారం.. భూమిలో జరిగే మార్పులు వలన ఈ విధంగా జరగుతుందని అంటున్నారు. ఇదే తరహాలో తెలంగాణలోనూ ఓ బావిలో వేడినీరు వస్తుంది. దీంతో ప్రజలు చాలా ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ఇది మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంలో కాకతీయుల కాలంలో నిర్మించిన పురాతనమైన శివాలయంలో వెలుగు చూసింది. ఆలయంలో పనిచేసే సుగుణ అనే మహిళ బావిలో నీళ్లు తోడగా క్రమంలో ఈ విషయాన్ని గమనించి అందరికి తెలియజేసింది. ఈ నీరు నాలుగు నెలల నుంచి ఇలాగే వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. అయితే ఇలాంటి ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో వెలుగులోకి రావడంతో అందరూ షాక్ కి గురవుతున్నారు. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో ఒకే రకంగా భూమిలో నుంచి వేడి నీళ్లు వస్తుండటంతో ప్రజలంతా ఆశ్చర్యపోతున్నారు.
- Tags
- marripadu mandal