- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీటిపై తేలియాడే విమానాశ్రయం.. ఎక్కడంటే ?
దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో నీటిపై తేలియాడే విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ ఎగువన కృష్ణా నదిపై వాటర్ ఏరో డ్రోమ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా కేంద్రం దేశవ్యాప్తంగా 14 చోట్ల వాటర్ ఏరోడ్రోమ్‌లు నిర్మించాలని నిర్ణయించింది. సముద్ర ఆధారిత పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా కేంద్ర నౌకాయాన శాఖ ఈ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు ఏపీ మారిటైమ్ అధికారులు వెల్లడించారు. ఈ తరహా ప్రాజెక్ట్‌ను కేంద్ర ప్రభుత్వం ఇదివరకే చేపట్టింది.
గుజరాత్‌లోని కెవాడియా వద్ద నిర్మించిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహం సమీపంలో శబర్మతి నదిపై దీన్ని నిర్మిస్తోంది. ఇకపోతే రాష్ట్రం విషయానికి వస్తే ప్రకాశం బ్యారేజీ వద్ద ఏరోడ్రోమ్‌ను నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్‌ను ఉడాన్ పథకం కిందికి చేర్చింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, కేంద్ర నౌకాయాన శాఖ, ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించిన సర్వే చేపట్టనుంది. రాష్ట్రానికి ఈ ప్రాజెక్ట్‌ను మంజూరు చేయడం పట్ల బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా మొత్తం రూ.450 కోట్లతో వాటర్ ఏరోడ్రోమ్‌లను అభివృద్ధి చేయనున్నారు. సీ ప్లేన్స్ ద్వారా మారుమూల ప్రాంతాలను సైతం ప్రధాన నగరాలతో అనుసంధానం చేయడంతో పాటు పర్యాటకులను ఆకర్షించే విధంగా వీటిని అభివృద్ధి చేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేస్తోంది.