సెంచరీ మిస్.. బాధ కలిగించింది

by Shiva |
సెంచరీ మిస్.. బాధ కలిగించింది
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 3-1తేడాతో విజయం సాధించి టీమ్ ఇండియా ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. నాలుగో టెస్టులో భారత జట్టు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కేవలం 4 పరుగుల దూరంలో సెంచరీని మిస్ అయ్యాడు. అతడికి మరో ఎండో‌లో సపోర్ట్ లేకపోవడంతో సెంచరీ చేయకుండానే నిరాశగా వెనుగిరిగాడు.

సుందర్ 96 పరుగుల దగ్గర ఉన్నప్పుడు కేవలం 5 బంతుల వ్యవధిలో అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్ వికెట్లు పడిపోవడంతో సుందర్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. టీమ్ ఇండియా అభిమానులు సుందర్ పట్ల విచారం వ్యక్తం చేశారు.

ఈ విషయంపై సుందర్ తండ్రి మురుగన్ స్పందించారు. తన కొడుకు వాషింగ్టన్ సుందర్ తొలి సెంచరీ మిస్ అవడం కలిగించిందని అన్నారు. అతడికి తోడుగా ఎవరూ లేకుండా టెయిలెండర్లు వికెట్లు పారేసుకోవడం నిరాశ కలిగించిందని తెలిపారు. ఇది టెస్టులో మొదటి ఇన్నింగ్స్ కాబట్టి సరిపోయింది. అదే టీమ్ ఇండియా విజయానికి 10 పరుగుల దూరంలో ఉన్నప్పుడు వరుసగా వికెట్లు కోల్పోవడం భారీ తప్పిదమే కదా అని ఆయన బాధపడ్డారు.

టెయిలెండర్లు అంటే కేవలం బౌలర్లే అనే భావనలో ఉండొద్దని.. పరుగులు చేయలేకపోయినా.. కనీసం వేరే ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్‌కు సహకరించాలని ఆయన అన్నాడు. వాషింగ్టన్ సుందర్ తండ్రికి కూడా క్లబ్ క్రికెట్, రంజీ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్నది.

Advertisement

Next Story